Moviesతెలుగోడో తొడ‌కొడితే... సిస‌లైన రాజ‌సంతో హ‌రిహర వీర‌మ‌ల్లు గ్లింప్స్ (వీడియో)

తెలుగోడో తొడ‌కొడితే… సిస‌లైన రాజ‌సంతో హ‌రిహర వీర‌మ‌ల్లు గ్లింప్స్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ‌ర్త్ డే కానుక‌గా ప‌వ‌న్ అభిమానులు సంబ‌రాల‌ను మ‌రింత‌గా పెంచేందుకు ఈ రోజు అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ పీరియాడిక‌ల్ మూవీ హరిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ చేశారు.

ఈ యేడాది భీమ్లానాయ‌క్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు హరిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు కోలీవుడ్ హిట్ మూవీ వినోద‌య సిత్తం రీమేక్‌లో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో హిస్టారిక‌ల్ క‌థాంశంతో వ‌స్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

Hari Hara Veera Mallu's Next Schedule Begins, Pawan Kalyan to Join Shoot on  April 8

ఇక ఈ రోజు రిలీజ్ అయిన ప‌వ‌ర్ గ్లింప్స్‌లో ప‌వ‌న్‌ను ఫస్ట్ టైం ఓ వారియ‌ర్‌గా అద్భుతంగా చూడ‌బోతున్నామ‌ని క్రిష్ చెప్ప‌క‌నే చెప్పేశాడు. నిమిషం పాటు ఉన్న ఈ గ్లింప్స్‌లో ప‌వ‌న్ మ‌ల్ల‌యోధుల‌ను త‌డ‌గొట్టి ప‌డ‌గొట్ట‌డం చూపించారు. తెలుగోడు తొడ‌గొడితే అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ నేప‌థ్యంలో ప‌వ‌న్ మీసం మెలేశాడు. కీర‌వాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా గ్లింప్స్‌ను మ‌రో రేంజ్‌కు తీసుకు వెళ్లింది.

PSPK wishes Happy Srirama Navami with Hari Hara Veera Mallu poster - ybrantnews.com

ఇక పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు చూపించారు. అలాగే ఈ సినిమాను వ‌చ్చే సమ్మ‌ర్ బ‌రిలోకి దింపుతున్న‌ట్టు కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఏదేమైనా గ్లింప్స్‌తో సినిమాపై అంచ‌నాలు అయితే మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news