Moviesఅయ్యయ్యో..ఆ అవకాశం కోసం..కీర్తి తప్పుడు పని..!?

అయ్యయ్యో..ఆ అవకాశం కోసం..కీర్తి తప్పుడు పని..!?

కీర్తి సురేష్.. అమ్మడు పేరు చెప్పగానే మన అందరికీ టక్కున గుర్తొచ్చే పదం మహానటి . ఈ సినిమాకి ముందు కీర్తి సురేష్ బోలెడన్ని సినిమాల్లో నటించింది . కానీ ఏ సినిమాల్లోనూ కీర్తి నటనకు ఇన్ని మార్కులు పడలేదు. కేవలం మహానటి సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమాలో అమ్మడు నటించలేదు.. జీవించేసింది. నిజంగానే సావిత్రి గారు బ్రతికి ఉంటే ఇలాగే ఉండేవారేమో అన్న విధంగా ఈ జనరేషన్ కు తెలియజేసింది.

కాగా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ చాలా సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా హిట్ అవ్వలేదు. రీసెంట్గా వచ్చిన సర్కారీ వారి పాట సినిమా తప్పిస్తే అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలాగే క్రమంగా ఫ్లాపులు పడితే తన కెరీర్ దెబ్బతింటుంది అనుకునిందో ఏమో కీర్తి సర్కార్ వారి పాట సినిమాలో హద్దులు మీరి రొమాన్స్ చేసింది. ఫస్ట్ టైం నాభి అందాలను చూపిస్తూ రెచ్చిపోయి పర్ఫార్మ్ చేసింది.

దీంతో అమ్మడికి కమర్షియల్ అవకాశాలు బాగా వస్తాయని అనుకున్నట్టుంది. కానీ సీన్ కట్ చేస్తే కీర్తి సురేష్ అలా అందాలు ఆరబోయడం అభిమానులకు నచ్చలేదు. అభిమానులకు నచ్చకపోతే డైరెక్టర్లు అవకాశాలు ఇస్తారా ఇవ్వరు అందుకే బిగ్ స్టార్స్ అయినా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్,ణ్టృ లాంటి హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేక పోతుంది. పద్ధతిగా చీర కట్టుకున్నప్పుడే మంచి అవకాశాలు వచ్చాయి కీర్తి సురేష్ కి. స్టార్ సినిమాలో అవకాశాల కోసం హద్దులు మీరి తప్పుడు పనులు చేసి అసలుకే తన క్యారెక్టర్ని పాడు చేసుకునింది కీర్తి సురేష్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news