Moviesసిరి, షణ్ముఖ్ రొమాన్స్ పై ఆది షాకింగ్ కామెంట్స్..యాంకర్ రవి పై...

సిరి, షణ్ముఖ్ రొమాన్స్ పై ఆది షాకింగ్ కామెంట్స్..యాంకర్ రవి పై అంత ఛండాలమైన మాట ఎలా అన్నాడు..!?

షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తన టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా చూపించి పాపులర్ అయిన యూట్యూబర్. కేవలం షణ్ముఖ్ జశ్వంత్ కాదు చాలామంది సామాన్య ప్రజలు తమలోని టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా చూపించుకోని కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళందరిలోకి టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఈ షణ్ముఖ్. అది ఒకప్పటి మ్యాటర్టర్. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టకు ముందు షణ్ముఖ్ జీవితం ఒకలా ఉండింది. ప్రేమించిన అమ్మాయి ఓ పక్కన.. ఆదరించే జనాలు మరోపక్క.. స్టార్ హీరోకి మించి పోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్.

కానీ బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంటర్ అయిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ టోటల్ తలరాత మారిపోయింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ట గౌరవం సంక నాకిపోయినాయి. ఎస్ ఇలాగే చెప్పాలి. తోటి కంటెస్టెంట్ సిరి తో నడిపించిన రొమాన్స్ , హంగామా, ఫ్రెండ్షిప్ కం కేరింగ్ ..అందరికి చాలా వల్గర్ గా అనిపించింది. పేరుకి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటూనే వెనకనుంచి హగ్ చేసుకోవడం ..ఒక్కేఅ దుప్పట్లో దూరి పడుకోవడం.. అవి కాస్త బిగ్ బాస్ క్యాప్చర్ చేసి టెలికాస్ట్ చేయడం ..ఆ టెలికాస్ట్ వీడియో ని బయట ఉన్న షణ్ముఖ్ లవర్ దీప్తి చూడడం ..దీంతో ఆమెకు ఒళ్ళు మండిపోయి బయటకు రాగానే బ్రేకప్ చెప్పడం.. ఫాస్ట్ గా జరిగిపోయాయి. దీంతో షణ్ముఖ జీవితం బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత అన్నట్లు తయారయింది.

కాగా ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్న టైంలో మళ్లీ లేవదీశాడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది. రీసెంట్ గా నవరాత్రి ఈవెంట్లో భాగంగా స్కిట్ ను వేశారు హైపర్ ఆది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హైపర్ ఆది తండ్రిగా నటిస్తుంటే ..సిరి కూతురుగా నటిస్తుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది ..తనదైన స్టైల్ లో పంచులు విసిరాడు. “సిరి వచ్చి నాన్న నాకు రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది అంటుంది ..దీంతో హైపర్ ఆది నీకు రెండు రోజులకే బోర్ కొడితే ఇక 100 రోజులు వాళ్ళని భరించే మా పరిస్థితి ఏంటి అన్నట్లు బిగ్ బాస్ గురించి సెటైరికల్ గా సెటైర్ వేస్తాడు. ఇక తర్వాత అదేంటి నేను బాగా నే ఎంటర్ టైన్ చేశాను కదా నాన్న అంటూ సిరి చెప్పగా ..ఫన్ మొత్తం షణ్ముక్ కే ఇచ్చావ్..మాక్ ఏం ఇచ్చావ్ అంటాడు. దీంతో షణ్ముఖ్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు హైపర్ ఆది అన్నమాటలకు సిరి సిగ్గుపడటం కోసమేరుపు. కాగా ఈ ఈవెంట్లో యాంకర్ రవిని కూడా వదల్లేదు హైపర్ ఆది.. అటు వెళ్లాలా ఇటు వెళ్లాలా అనేది అర్థం కావడం లేదు అంటూ రవి అనగా అందుకే కదా ఏమీ తెలియకుండా అన్ని చానల్స్ తిరుగుతున్నావు అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు . దీంతో అటు షణ్ముఖ్ ఫ్యాన్స్..ఇటు యాంకర్ రవి ఫాన్స్ హైపర్ ఆదిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news