Moviesగాడ్‌ఫాదర్‌కు ఎదురు దెబ్బ‌... చిరంజీవి ఫ్యాన్స్‌లో ఎప్పుడూ లేనంత నిరాశ ఎందుకు......

గాడ్‌ఫాదర్‌కు ఎదురు దెబ్బ‌… చిరంజీవి ఫ్యాన్స్‌లో ఎప్పుడూ లేనంత నిరాశ ఎందుకు… !

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే మెగాభిమానుల్లో ఎంత‌లా అంచ‌నాలు ఉంటాయో తెలిసిందే. అస‌లు చిరు సినిమా అంటేనే వారం రోజుల ముందు నుంచే తెలుగు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది. సినిమా హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా చిరు క్రేజ్ వేరు. అయితే ప్ర‌స్తుతం చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోంది.

మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా న‌య‌న‌తార హీరోయిన్‌. అయితే సినిమా ద‌స‌రా కానుక‌గా వ‌స్తుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా మీద ఏ మాత్రం బ‌జ్ లేదు. అస‌లు సినిమా ప‌రంగా ఏ మాత్రం ఆస‌క్తి లేనే లేదు. ఆచార్య ప్లాప్ కావ‌డంతో చిరు అభిమానులు మాత్ర‌మే కాదు మెగాభిమానులు అంద‌రూ గాడ్‌ఫాధ‌ర్‌తో త‌మ అభిమాన హీరో కం బ్యాక్ అవుతాడ‌న్న ధీమాతో ఉన్నారు.

 

అయితే ప్రి రిలీజ్ బ‌జ్ చూస్తూ వీళ్లు నిరుత్సాహంగా ఉన్నారు. మ‌రో వైపు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోంది. ట్రైల‌ర్లు, ప్ర‌మోష‌న్లు ఇంకా స్టార్ట్ కాక‌పోవ‌డం కూడా ఫ్యాన్స్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. మ‌రోవైపు సినిమా హిందీ రిలీజ్ కూడా వాయిదా ప‌డింది. బాలీవుడ్ స్టార్ హీరో, కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నా కూడా ఎందుకో ఆ రేంజ్ బ‌జ్ లేదు.

మ‌రోవైపు ఈ సినిమాను రు. 150 కోట్ల రేంజ్ లో బిజినెస్ అంటున్నా.. ఆ స్థాయిలో అంచ‌నాలు అయితే లేవు. ఇక ఏపీ, తెలంగాణ‌లో సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఏదేమైనా సినిమాకు ఇప్ప‌ట‌కి అయినా భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు లేక‌పోతే ఖ‌చ్చితంగా ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ ప‌డేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news