Moviesపాపం..ఈ టాలీవుడ్ హీరోయిన్ల జాతకాలు ఒకటే..లాస్ట్ కి అదే గతి..!?

పాపం..ఈ టాలీవుడ్ హీరోయిన్ల జాతకాలు ఒకటే..లాస్ట్ కి అదే గతి..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం ఎంత కష్టమో వచ్చిన తర్వాత ఆ పేరుని నిలబెట్టుకోవడం అంతే కష్టం. అంతేకాదు ఒకటి రెండు హిట్లు పడిన ఆ తర్వాత ఆ పేరు ఎలక కాలం ఉండదు. అదే హీరోయిన్లకు మెయిన్ మైనస్ పాయింట్. అలా ఒకటి రెండు సినిమాలు హిట్టు పడి కెరియర్ ఇంకా సక్సెస్ కానీ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం..!!


కేథరిన్: ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అమ్మడిలో పుష్కలంగా టాలెంట్ ఉంది . అందాలు ఆరబోసే సత్తా ఉంది. అడపాదడపా హిట్స్ కూడా పడుతున్నాయి. అయినప్పటికీ కేథరిన్ పెద్దగా స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వలేకపోయింది. సరైనోడు సినిమా కూడా హిట్ అయింది. కానీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవలేకపోయింది. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన బింబిసారా సినిమా కూడా హిట్ అయింది . కానీ కేథరిన్ సినిమా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.

సంయుక్త మీనన్ : రీసెంట్ గా వచ్చిన బింబిసారా అంతకుముందు వచ్చిన భీమ్లా నాయక్.. రెండు సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ గా నటించి తనదైన స్టైల్ లో మెప్పించింది. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కానీ సంయుక్త మీనన్ కి అవకాశాలు మాత్రమే ఇవ్వట్లేదు టాలీవుడ్ డైరెక్టర్లు.

అనుపమ పరమేశ్వరన్: ఈ మలయాళ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అ ఆ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత బోలెడన్ని సినిమాలు చేసింది. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అయినా కానీ ఇంకా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అవ్వలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news