Movies' చిరంజీవి ' - ' స‌ల్మాన్‌ఖాన్ ' తార్‌మార్ త‌క్కెడ...

‘ చిరంజీవి ‘ – ‘ స‌ల్మాన్‌ఖాన్ ‘ తార్‌మార్ త‌క్కెడ మార్‌ ఇంత పెద్ద త‌ప్పు జ‌రుగుతోందా…!

ఒక‌రు టాలీవుడ్ మెగాస్టార్‌.. మ‌రొక‌రు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌. వీరిద్ద‌రు క‌లిసి ఓ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు ? అంటే ఆ మ‌జానే వేరే. ఆ సినిమా క్రేజే వేరు. అలాంటి అరుదైన క‌ల‌యిక‌కు మెగాస్టార్ గాడ్ ఫాథ‌ర్ సినిమా వేదిక కాబోతోంది. మ‌ల‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోంది గాడ్ ఫాథ‌ర్‌. ఈ సినిమాలో చిరు, న‌య‌న‌తార న‌టిస్తున్నారు.

మోహ‌న‌రాజా ద‌ర్శ‌కుడు. ఆయన గ‌తంలో తెలుగులో 20ఏళ్ల క్రింద‌ట వ‌చ్చిన హనుమాన్ జంక్ష‌న్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చిరు, స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటే క్రేజ్ అదిరిపోవాలి. అయితే ఆ రేంజ్ క్రేజ్ ఈ సినిమాకు ఉందా ? వ‌చ్చే నెల 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా సినిమాకు అనుకున్న బ‌జ్ లేద‌నే అంటున్నారు.

ఇక వీరిద్ద‌రి మీద తార్ మార్ త‌క్కెడ‌మార్‌ అనే పాట రూపొందించారు. ముంబైలో ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌లో ఈ పాట షూట్ జ‌రిగింది. బుధ‌వారం రిలీజ్ అయిన ఈ పాట కూడా చిరు అభిమానుల‌నే పెద్ద‌గా మెప్పించ‌లేదు. ఇక ఈ పాట సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా ? అన్న ఆశ‌లు అభిమానుల్లో ఉన్నా వాటిని ముందే నిరాశ చేసేశారు ఈ సినిమా మేక‌ర్స్‌.

ఈ పాట గురించి డిజ‌ప్పాయింట్ చేసే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సాంగ్ ఎండ్ టైటిల్స్ మాత్ర‌మే వ‌స్తుంద‌ట‌. ఈ సాంగ్‌కు సినిమాలో ప్లేస్‌మెంట్ కుద‌ర‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు ఎండ్ టైటిల్స్‌లో సెట్ చేశార‌ట‌. ఇది చాలా నిరుత్సాహ ప‌రిచే విష‌య‌మే. అప్ప‌టికే సినిమా రిజ‌ల్ట్ తెలిసిపోతుంది.. ఇక ఈ సాంగ్‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. సినిమా బాగుంటే కొంద‌రు అయినా థియేట‌ర్ల‌లో లేచి నుంచొని పాట‌ను ఎంజాయ్ చేస్తారు.

అదే సినిమా రిజ‌ల్ట్ తేడా కొడితే ఆ సాంగ్ వ‌స్తున్నా థియేట‌ర్ల‌లో ఎవ్వ‌రూ మిగ‌ల‌రు. లైగ‌ర్లో కూడా మంచి సాంగ్‌ను ఎండ్ టైటిల్స్‌లో పెట్టారు. అప్ప‌టికే సినిమా డిజ‌ప్పాయింట్‌మెంట్ చేయ‌డంతో ఆ మంచి సాంగ్‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోకుండా థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. మ‌రి చిరు – స‌ల్మాన్ లాంటి స్టార్ హీరోల పాట సినిమా మ‌ధ్య‌లో ఉంటేనే అందం ఉంటుంది..!

Latest news