Moviesతెలిసి తెలిసి బిగ్ మిస్టేక్ చేస్తున్న మహేశ్ బాబు..సూపర్ స్టార్ కి...

తెలిసి తెలిసి బిగ్ మిస్టేక్ చేస్తున్న మహేశ్ బాబు..సూపర్ స్టార్ కి ఆ విషయం తెలియదా..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ మిస్టేక్ చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . అది ఆయన కెరియర్ విషయంలో కాదు తన కూతురు సినీ కెరియర్ కు సంబంధించి తెలిసి తెలిసి మహేష్ బాబు బిగ్ మిస్టేక్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్స్ కూడా అవును మహేష్ బాబు సితార విషయంలో తప్పు చేస్తున్నాడు అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

మనకు తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇద్దరు బిడ్డలు. ఒకరు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు . రెండోది సితార పాప ..ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉంటుంది. తన అల్లరి ,తన చిలిపితనం, తన స్టైల్, ట్రెడిషనల్ లుక్స్, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి. అమ్మ నమ్రత , మహేష్ బాబు కూడా సితార పాపకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ కూతురిని మరింత పాపులర్ చేస్తున్నారు.

కాగా సితార రీసెంట్ గానే సర్కారు వారి పాట సినిమాలో పెన్ని అనే సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. సితార తండ్రితో కలిసి కాళ్లు కదిపి తన సినీ రంగ ప్రవేశానికి పునాది వేసుకుంది . అంతే కాదు మహేష్ బాబు కూడా సితార కి హీరోయిన్ అవ్వాలని ఉంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అలాంటి అమ్మాయిని మహేష్ బాబు ఎందుకు సీరియల్ ప్రమోషన్స్ కి వాడుకుంటున్నాడు అంటూ కొందరు ప్రముఖులు మహేష్ బాబును నెగటివ్ చేస్తున్నారు.

అంతేకాదు సితార పాపకు డాన్స్ ఇష్టం ..ఓకే డాన్స్ షోకి తీసుకెళ్లారు . మరి “పడమటి సంధ్యారాగం” అనే సీరియల్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. సితార పాపర్ రేంజ్ ఏంటి.. ఆమె గోల్ ఏంటి.. అర్థం చేసుకోకుండా మహేష్ బాబు ఎందుకు కూతురు విషయంలో ఇలా చేస్తున్నాడు. ఆ మాత్రం తెలియదా వెండితెర పై స్టార్ అవ్వాల్సిన సితార ని బుల్లితెరపై ప్రమోట్ చేస్తే సితార పాప ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి మహేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news