Moviesఆఫర్ల‌ కోసం హీరోయిన్ల‌ చీకటి ఒప్పందాలు... సంచలనాలు బయటపెట్టిన టాలీవుడ్ నటి...

ఆఫర్ల‌ కోసం హీరోయిన్ల‌ చీకటి ఒప్పందాలు… సంచలనాలు బయటపెట్టిన టాలీవుడ్ నటి …!

టాలీవుడ్ లో చాలా మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అయితే గుర్తుండి పోయే పాత్ర‌లు చేసిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు మాత్రం చాలా త‌క్కువ మంది ఉన్నారు. అంతే కాకుండా లేడీ ఆర్టిస్ట్ ల‌ను అయితే వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చు. కాగా టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టి అపూర్వ‌. బేసిక్ గా క‌న్న‌డ న‌టి అయిన అపూర్వ తెలుగులోనూ పాపులారిటీని సంపాదించుకుంది. అపూర్వ అల్లరి సినిమాతో పాటూ చాలా సినిమాల‌లో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసింది.

ముఖ్యంగా ఎక్కువ‌గా వ్యాంప్ పాత్ర‌ల‌తో అపూర్వ కుర్రాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకుంది. అంతే కాకుండా త‌ల్లి మరియు క‌మెడియ‌న్ల‌కు భార్య లాంటి పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించింది. ఇక ఇప్ప‌టికీ సినిమాల‌లో ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తూ అపూర్వ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే గ‌తంలో కొన్నేళ్ల క్రితం అమెరికాలో కొంత‌మంది న‌టీమ‌ణులతో వ్య‌భిచారం నిర్వహించ‌డం సంచ‌ల‌నం రేపింది. ఈ వార్త ఈ అప్ప‌ట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వ్య‌వ‌హారం పై అపూర్వ మ‌రియు న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ లు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. కాగా ఇంట‌ర్య్వూలో న‌టి అపూర్వ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అమెరికాలో వ్యభిచారం లో పాల్గొన్న న‌టీమ‌ణులు అంతా డ‌బ్బుల కోసమే అలాంటి ప‌నులు చేశార‌ని అన్నారు. డ‌బ్బు కోసం కొంత మంది హీరోయిన్ లు దేనికీ వెన‌కాడ‌రు అంటూ ఆరోప‌ణలు చేసింది. అంతే కాకుండా ఈ వ్య‌వ‌హారం అంతా హీరోయిన్ ల‌కు తెలియ‌కుండానే జ‌రిగిందా అంటూ ప్ర‌శ్నించింది.

డ‌బ్బు కోసం కొంత‌మంది హీరోయిన్ లతో చీక‌టి ఒప్పందాలు చేసుకుంటారంటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఇదిలా ఉంటే సినిమా ఇండ‌స్ట్రీలో ఇలాంటి వ్య‌వ‌హ‌రాలు అప్పుడ‌ప్పుడూ భ‌యట‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే వార్త‌లు వ‌చ్చిన కొద్ది రోజులు మాత్రం మీడియాలో మారుమోగిపోతూ ఉంటుంది. అంతే కాకుండా అధికారులు కూడా విచార‌ణ పేరుతో నానా హంగామా చేస్తుంటారు. కానీ ఆ త‌ర‌వాత ఈ వార్త‌ల‌ను అంతా మ‌ర్చిపోతారు. ఇక మ‌ళ్లీ ఇలాంటి వ్య‌వ‌హ‌రాలు భ‌య‌ట‌ప‌డిన‌ప్పుడే హంగామా మొద‌లు పెడ‌తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news