Moviesఅప్పుడు లేవని నోర్లు..ఇప్పుడు లేస్తున్నాయే..ఏం..!?

అప్పుడు లేవని నోర్లు..ఇప్పుడు లేస్తున్నాయే..ఏం..!?

సినీ ఇండస్ట్రీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ..అందరి కళ్ళు మెగా హీరోలు పైనే ఉంటుంది. మెగా హీరోలంటే అభిమానమో లేదా.. వాళ్ళ పాపులారిటీ చూసుకొని కుళ్లో తెలియదు కానీ, కొందరు స్టార్ సన్స్ కూడా మెగా హీరోలపై నోరు పారేసుకుంటూ ఉంటారు. అలా నోరు పారేసుకున్న సందర్భాలు కూడా మనం చాలానే చూశాం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికంటికి ఓ చిన్న మిస్టేక్ చాలా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. అదే అల్లు అర్జున్ విదేశాలకి కి వెళ్లడం.

మనకు తెలిసిందే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే.. మెగా అభిమానులకే కాదు , మెగా కుటుంబానికి ఓ పెద్ద పండుగ రోజే. ఈసారి మెగాస్టార్ చిరంజీవి బర్త డే వేడుకలను ఘనంగా చేయాలని డిసైడ్ అయ్యారు నాగబాబు. ఈ క్రమంలోనే ఆయన బర్తడే సందర్భంగా ప్రముఖులతో కలిసి కార్నివాల్ పేరుతో భారీ వేదికను ఏర్పాటు చేశారు . ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ అటెండ్ అవుతున్నారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్పిస్తే. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలు అందరూ అటెండ్ అవుతారని నాగబాబు చెప్పుకొచ్చ్చారు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అల్లు అర్జున్ మాత్రం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన పర్సనల్ పనులు కావచ్చు మిగతా పనులు కావచ్చు.. కారణాలు ఏదైనా బన్నీ విదేశాలకు వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. మొదటి నుంచి చిరంజీవికి అల్లు ఫ్యామిలీకి పడదు అంటూ ఓ రూమర్ బాగా వైరల్ అవుతుంది. ఆ రూమర్ కి ఆజ్యం పోసినట్టు కరెక్ట్ గా చిరంజీవి పుట్టిన రోజు వేడుకల టైం లోని ఇలా ఫారిన్ కి చెక్ చేయడం మెగా అభిమానులను హర్ట్ చేసింది. దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ పై సీరియస్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానులు.. మెగా అభిమానులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి.. ఎంతోమంది మెగా ఫ్యామిలీ పై పడుతున్నారు.. కానీ, అందరికీ అల్లు అర్జున్ చేసిన పని నే తప్పుగా కనిపిస్తుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వట్లేదు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఆ విషయాల్లో ఎవ్వరు పట్టించుకోరు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అయినా అప్పుడు ఎవరు నోరు తెరిచి అడగలేదు. మెగా ఫ్యామిలీని కొందరు సో కాల్డ్ ఆర్టిస్ట్ నోటికొచ్చిన బూతులు తిట్టారు. అయినా అప్పుడు ఎవరు మాట్లాడలేదు. కానీ అల్లు అర్జున్ తన పనిమీద విదేశాలకు వెళ్తే మాత్రం నానా రచ్చ చేస్తున్నారు” అంటూ మండిపడుతున్నారు. మరి దీనికి మెగా అభిమానులు ఏం సమాధానం ఇస్తారో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news