Moviesఆ స్టార్ హీరో సినిమా షూటింగ్‌లో పవిత్రా లోకేష్‌కు ఘోర అవ‌మానం.....

ఆ స్టార్ హీరో సినిమా షూటింగ్‌లో పవిత్రా లోకేష్‌కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగిందంటే…!

టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఇద్దరు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ హీరో ప్రముఖ క్యారెక్టర్ నటుడు నరేష్.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గత ఐదు ఆరు నెలలుగా ఎంతలా వార్తల్లో ననుతున్నారు చూస్తూనే ఉన్నాం. నరేష్‌తో పవిత్ర లోకేష్ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలతో ఆమె బాగా హాట్ టాపిక్ అయింది. అయితే అటు నరేష్.. ఇటు పవిత్ర ఇద్దరూ కూడా తమ చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకుంటున్నా అవేమి పట్టించుకోకుండా తమ కెరీర్లో తాము బిజీగా ఉన్నారు.

విచిత్రం ఏంటంటే వీరు బాగా కాంట్రవర్సీ అయ్యాక మరింత పాపులర్ అవుతుండడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పవిత్ర క్రేజ్‌ పెరగడంతో గతంతో పోలిస్తే తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తుంది. పవిత్ర – నరేష్ మధ్య ఏజ్ గ్యాప్ 20 సంవత్సరాలకు పైనే ఉంది. నరేష్ వయస్సు 63 కాగా… పవిత్ర లోకేష్ వయసు నాలుగున్న‌ర పదుల మధ్యలో ఉంది. నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కాగా… పవిత్రకు కూడా ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి.

అయితే వీరిద్దరూ కాంట్రాక్టు సహజీవనం చేస్తున్నారన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పవిత్ర లోకేష్ ఒక స్టార్ హీరో మూవీలో నటిస్తుండగా… ఈ మూవీ సెట్స్‌లో ఆమెకు అవమానం జరిగిందన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ ను తన సినిమా నుంచి తప్పించాలని ఆ స్టార్ హీరో దర్శ‌కుడికి సూచించారంట. ఇదంతా ఆమె సెట్స్‌లో ఉండ‌గానే జ‌రిగింద‌ట‌. దీంతో ఈ విష‌యం ఈ నోటా.. ఆ నోటా బ‌య‌ట‌కు పొక్కేసింది.

దీంతో దర్శకుడికి పవిత్రను తప్పించడం ఇష్టం లేకపోయినా… ఆమెకు బదులుగా మరొకరిని తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆ హీరో సూచన మేరకే దర్శకుడు పవిత్రను ఆ సినిమా నుంచి తప్పించడంతో పాటు మరో సీనియర్ ఆర్టిస్టును ఆమె స్థానంలో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఏదేమైనా నరేష్‌తో ఎఫైర్ వార్తల తర్వాత పవిత్ర లోకేష్‌కు ఒకవైపు క్రేజ్ పెరుగుతుంటే… అదే మరోవైపు ఆమెకు మైనస్ గా కూడా మారినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news