Moviesసీతారామం ప్రీమియర్ టాక్... హిట్టా.. ఫట్టా?

సీతారామం ప్రీమియర్ టాక్… హిట్టా.. ఫట్టా?

ఈ రోజు బాక్స్ ఆఫిస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాల పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు అభిమానులు. నందమూరి నట వారసుడు కల్యాణ్ రామ్ బింబిసారా గా మన ముందుకు వస్తే..మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఫస్ట్ టైం తెలుగు డైరెక్ట్ గా సీతారామం అంటూ వచ్చాడు. నిజానికి తెలుగులో దుల్కర్ సల్మాన్ ఎక్కువ సినిమాలు నటించకపోయినా..ఆయన మలయాళం లో చేసిన ..సినిమాలు ఓట్ట్ ల ద్వార చూసి..తెలుగు అభిమానుల మనసు దోచుకున్నాడు. ఈ క్రమంలో నే ఆయన నటించిన సీతా రామ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు జనాలు. కాగా, కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా 1985 ప్రాంతంలో ప్రారంభం అవుతున్నట్లు మనకు చూపిస్తారు. కధ మొత్తానికి కి పాయింట్ మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్)..కానీ ఆమె ఈ సినిమాలో కనిపించేదే తక్కువ. పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఓ బరువైన సీక్రేట్ బాధ్యత ఇస్తాడు. మహాలక్ష్మి ఎక్కడుందో కనుక్కొని.. ఆమెకు తన ప్రియుడు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఇళ్ళ క్రితం రాసిన ఓ లెటర్ అందజేయాలని కొరుతాడు. దీంతో మహాలక్ష్మిని వెత్తుకుంటూ రష్మిక ఎక్కడికి వెళ్లింది..? ఇంతకి ఆ లెటర్ లో ఏముంది..? రామ్ ఏమైపోయాడు..? వాళ్ల ప్రేమ ఎలా మొదలైంది..? లాస్ట్ కి ఏం జరిగింది..? ఇదే కధ.

నిజానికి ఇలా చాలా రోటీన్ స్టోరీ..కానీ, తనదైన మార్క్ తో మెప్పించాడు డైరెక్టర్. మహాలక్ష్మి ని వెతికే క్రమంలో రష్మిక పడే కష్టం జనాలను బాగా ఆకట్టుకుంది. అస్సలు జీవితం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుంటుంది. ఈ మార్గంలో నే ఆమె కొత్త విషయాలు తెలుసుకుంటుంది. సినిమాకి హను రాఘవపూడి డైరెక్షన్ ప్లస్ పాయింట్ అయితే, దుల్కర్ సల్మాన్ నటన కూడా హైలెట్ గా నిలిచింది. తెర పై రామ్, మహాలక్ష్మి రొమాన్స్ బాగా పండింది. జనాలను ఆకట్టుకుంది. ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సస్పెన్సు ప్రేక్షకుల మదిలో క్యారీ అయ్యేలా దర్శకుడు చేయగలిగాడు. కానీ , సినిమా అంతా స్లో గా సాగుతుంది.

పెద్దగా చెప్పుకొతగ్గ అంశాలు కూడా లేవు, సీన్స్ తగ్గట్లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందనే కానీ..ధియేటర్ నుంచి జనాలు బయటకు వచ్చక గుర్తు పెట్టుకునేంత సినిమా అయితే కాదు అంటున్నారు కొందరు జనాలు. మహాలక్ష్మికి ఏమైంది ? ఆమె ఎక్కడ ఉందనే? ఓ ఆత్రుత కలుగుతుందే తప్పిస్తే… మిగతా స్టోరీ అంతా బిస్కెట్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా డీసెంట్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా పర్లేదు అనిపించాయి. అయితే మెల్లగా సాగే కధతో అది కూడా మైనస్ గా నిలిచింది. ఇది ఒకింత నిరాశపరిచే అంమే అని చెప్పాలి. ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పే క్రమంలో హను పూర్తిగా బోళ్తా కొట్టాడు అంటున్నారు జనాలు. మొత్తంగా ఈ సినిమా లవర్స్ కు , ప్రేమ లో ఉన్న వాళ్ళకి, ప్రేమ విలువ తెలిసిన వారికి మాత్రమే నచ్చుతుంది తప్పిస్తే…మిగత వాళ్ళకి నచ్చదు. దీంతో సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news