Moviesహీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న రోజా కూతురు... ఆ స్టార్ హీరో వార‌సుడితో...

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న రోజా కూతురు… ఆ స్టార్ హీరో వార‌సుడితో రొమాన్స్‌..!

తెలుగులో సీనియ‌ర్ హీరోయిన్ రోజా రెండు ద‌శాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అస‌లు రోజా అంటేనే అందంతో పాటు అభిన‌యంలో కూడా తిరుగులేని స్టార్ హీరోయిన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అంద‌రు హీరోల‌తోనూ ఆమె న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె కోలీవుడ్ డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా మంత్రిగా కొన‌సాగుతున్నారు.

రోజా ఇప్పుడు మంత్రిగా ఉండ‌డం అంటే ఆమె ఈ స్థాయికి రావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఇక ఇప్పుడు రోజా కుమార్తె అన్షు మాలిక కూడా పెద్ద‌ది అయిపోయింది. ప్ర‌స్తుతం ఆమె వెండి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ట‌. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు గ‌త కొంత కాలంగా వినిపిస్తున్నాయి. త‌న న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ కుమార్తెను రోజా హీరోయిన్‌ను చేసే ట్రైల్స్‌లో ఉంద‌ట‌.

అన్షు మాలిక ఇప్ప‌టికే USలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావ‌డంతో అక్క‌డ ట్రైనింగ్‌లో శిక్ష‌ణ పొందుతోంది. అక్క‌డ నుంచి వ‌చ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేయ‌నుంది. టాలీవుడ్ న‌ట వార‌సుడు హీరోగా నటించే సినిమాతోనే అన్షు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని తెలుస్తోంది. నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌లో ఇప్ప‌టికే మేనకు కుమార్తె కీర్తి సురేష్‌, రాధ కూతుళ్లు తుల‌సి, కార్తీక‌, మంజుల కూతుళ్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో కేవ‌లం జాన్వీ క‌పూర్ మాత్ర‌మే స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. మ‌రి అన్షు మాలిక త‌న త‌ల్లి రోజా ఘ‌న‌మైన న‌ట వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేస్తుందా ? ఎలా నిల‌దొక్కు కుంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news