Moviesఇంగ్లండ్‌లో ఇల్లాలు ప్ర‌ణ‌తీతో ఎన్టీఆర్ కాఫీ క‌బుర్లు...!

ఇంగ్లండ్‌లో ఇల్లాలు ప్ర‌ణ‌తీతో ఎన్టీఆర్ కాఫీ క‌బుర్లు…!

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఇటీవ‌ల కాస్త గ్యాప్ వ‌స్తే చాలు విదేశీ టూర్‌లు చెక్కేస్తున్నారు. ఈ లిస్టులో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మ‌హేష్ త‌న భార్య న‌మ్ర‌త‌, ఫ్యామిలీతో క‌లిసి విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లిపోతాడు. కొద్ది రోజుల క్రిత‌మే అమెరికా వెళ్లి వ‌చ్చిన మ‌హేష్ ఇప్పుడు లండ‌న్‌లో త‌న భార్య‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. న‌మ్ర‌త‌ను కౌగిలించుకుని ఉన్న ఫొటో తాజాగా నెట్టింట్లో వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఫారిన్ ట్రిప్స్ మామూలుగా వేయ‌రు. అయితే క‌రోనా టైం నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా గ్యాప్ వ‌స్తే విదేశీ ట్రిప్‌ల‌కు వెళుతున్నాడు. త్రిబుల్ ఆర్ షూటింగ్ టైంలో కూడా గ్యాప్ వ‌స్తే చాలు విదేశీ ట్రిప్‌కు వెళ్లిపోయేవాడు. తాజాగా ఎన్టీఆర్ విదేశీ ట్రిఫ్‌లో భార్య‌తో క‌లిసి ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమా ఏదీ షూటింగ్‌లో లేదు.

 

త్రిబుల్ ఆర్ వ‌చ్చి కూడా నాలుగు నెల‌లు దాటింది. కొర‌టాల శివ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియ‌డం లేదు. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తోనూ ఎన్టీఆర్ 31వ ప్రాజెక్టు కూడా భారీ పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోంది. ప్రస్తుతం సినిమాల షూటింగ్‌లు బంద్ న‌డుస్తుంది. కొర‌టాల సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు ఇంకా టైం ఉండ‌డంతో ఎన్టీఆర్ త‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని తీసుకుని లండ‌న్ చెక్కేశాడు.

లండ‌న్‌లో త‌న భార్య‌తో ఓ ప‌చ్చ‌ని ప్ర‌దేశంలో ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఇద్ద‌రూ క‌లిసి కాఫీ తాగుతూ ఎంచ‌క్కా క‌బుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్ద‌రూ క‌బుర్ల‌లో మునిగిపోయిన‌ప్పుడు ఆ ఫొటో తీసిన‌ట్టుగా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ఎక్కువుగా త‌న ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేయ‌డు. అయితే తాజా ఫొటోలో మాత్రం కొత్త‌గా క‌నిపిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news