Moviesఆ విషయంలో మా ఆయన కింగ్ ..నయనతార కామెంట్స్ వైరల్..!?

ఆ విషయంలో మా ఆయన కింగ్ ..నయనతార కామెంట్స్ వైరల్..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార అమ్మడు ఇప్పుడు పిచ్చ హ్యాపీగా ఉంది. ఇష్టపడిన ప్రియుడిని పెళ్లి చేసుకుని సెకండ్ హనీమూన్ కి కూడా వెళ్ళింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంటర్ అయిన నయనతార కెరియర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా తండాలు పడ్డారు. కెరియర్ మొదట్లో నయనతార హీరోయిన్ గానే చేయాలి అని గిరి గీసుకోలేదు. తనకు నచ్చిన పాత్ర ఏదైనా సరే చేసి జనాలను మెప్పించాలని ట్రై చేసింది. అందుకే ఇప్పుడు నయనతార సౌత్ లోనే బిజీయస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

రీసెంట్ గా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార. ప్రజెంట్ సెకండ్ హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సెకండ్ హనీమూన్ ఖర్చులన్నీ ఓ ప్రముఖ సంస్ధ భరిస్తుందని. నయనతారకు విగ్నేష్ కు మ్యారేజ్ గిఫ్ట్ గా ఓ సంస్ధ భారీ ఆఫర్ ని ఇచ్చిందని.. ఈ క్రమంలోనే వాళ్ళ హనీమూన్ ఖర్చులన్నీ ఆ ప్రముఖ సంస్థ భరిస్తుందంటూ కోలీవుడ్లో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ప్రజెంట్ నయనతార తన భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి.

అఫ్ కోర్స్ ఏ భార్యకైనా తన భర్త హీరోనే.. అది సెలబ్రిటీ లైన సామాన్యులైన ..కానీ, నయనతార ఓ అడుగు ముందుకేసి ఆమె భర్తని ఓ రేంజ్ లో పొగిడేసిందట. ప్రస్తుతం ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ” నా కెరియర్ మొదట్లో నేను చాలామంది అబ్బాయిలను చూశాను. కొందరు మనసు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ విగ్నేశ్ శివన్ నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. నా అందాన్ని కాదు నా మనసుని ఇష్టపడ్డాడు. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే మా ఆయనని ఎప్పుడు నేను హర్ట్ చేయను. మా ఆయన బాధపడే పనులు చేయను. నన్ను అర్థం చేసుకోవడంలో మా ఆయన కింగ్ “అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో నయనతార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news