Moviesఒక్క సినిమాకే భారీగా రేటు పెంచేసిన సీత‌... ఆమె డిమాండ్లు, కండీష‌న్ల‌తో...

ఒక్క సినిమాకే భారీగా రేటు పెంచేసిన సీత‌… ఆమె డిమాండ్లు, కండీష‌న్ల‌తో నిర్మాత‌ల‌కు చుక్క‌లే..!

మలయాళ స్టార్ హీరో దుల్కల్ సల్మాన్ , మరాఠీ భామ మృణాల్‌ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లలో ఒకటి అయిన వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు హ‌ను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోల్ పోషించింది. ఆగస్టు 5న నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాకు పోటీగా రిలీజ్ అయిన సీతారామం ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.

ఇప్పటికీ సీతారామం సినిమా అటు ఓవర్సీస్ తో పాటు… ఇటు ఏ సెంటర్లు, మల్టీప్లెక్స్ లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నితిన్ మాచర్ల నియోజకవర్గం – నిఖిల్ కార్తికేయ 2 తాజాగా విజయ్ దేవరకొండ లైగ‌ర్ లాంటి సినిమాలు వచ్చాయి. అయినా సీతారామంకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ మృనాల్ చాలా హైలెట్‌గా నిలిచింది. సీతా మహాలక్ష్మిగా ఆమె చేసిన పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తన నటనతో పాటు అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు తెలుగులో మంచి డిమాండ్ పెరిగిపోయింది.

ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు వ‌స్తున్నాయి. వైజ‌యంతీ బ్యాన‌ర్లోనే ఆమె మ‌రో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే స్వ‌ప్న బ్యాన‌ర్లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాకు కూడా ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక తెలుగులో డిమాండ్ పెరుగుతుండ‌డంతో ఆమె రేటు భారీగా పెంచేసింద‌ని అంటున్నారు. ఇప్పుడు మృణాల్ ఒక్కో సినిమాకు ఏకంగా రు. కోటి డిమాండ్ చేస్తోంద‌ట‌. తొలి సినిమా త‌ర్వాత వెంట‌నే ఆమె ఈ రేంజ్లో డిమాండ్ చేస్తుండ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు షాక్ అవుతున్నారు.

మృణాల్ ముందు టీవీ సీరియ‌ల్స్ ద్వారా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. మ‌రాఠిలో ఆమె ప‌లు సీరియ‌ల్స్‌లో కూడా న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్న చిన్న సినిమాలు చేసుకుంటోంది. ఆ క్ర‌మంలోనే ఆమె హిందీ జెర్సీ సినిమాలో న‌టించింది. ఆ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా.. ఆమె పాత్ర‌కు మంచి స్కోప్ వ‌చ్చింది. ఆ సినిమాలో ఆమె అందాన్ని చూసి ఫిదా అయిన సీతారామం మేక‌ర్స్ ఆమెకు తెలుగులో ఛాన్స్ ఇచ్చారు.

అయితే ఫ‌స్ట్ సినిమా హిట్ అవ్వ‌డంతోనే ఆమె కోటి రూపాయ‌ల‌కు త‌క్కువ అయితే సినిమా చేయ‌న‌ని కండీష‌న్ పెట్ట‌డంతో ఇప్పుడు ఆమె టాలీవుడ్‌లో త‌క్కువ టైంలోనే హాట్ టాపిక్ అయిపోయింది. మ‌రి మృణాల్ ఈ క్రేజ్‌ను ఎలా ఎప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ చేస్తుందో ? ఎంత పెద్ద హీరోయిన్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news