Moviesమ‌హేష్‌బాబు హీరోయిన్‌ను క‌మిట్మెంట్ అడిగిన టాలీవుడ్ స్టార్ హీరో..? ఆ కోరిక...

మ‌హేష్‌బాబు హీరోయిన్‌ను క‌మిట్మెంట్ అడిగిన టాలీవుడ్ స్టార్ హీరో..? ఆ కోరిక తీర్చ‌లేకే..!

మ‌హేశ్ బాబు డిజాస్ట‌ర్ సినిమాల లిస్ట్ లో అతిథి సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా డిజాస్ట‌ర్ దెబ్బ‌తో మ‌హేష్‌బాబు ఏకంగా మూడేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మ‌య్యాడు. అతిథి 2007లో రిలీజ్ కాగా… 2010లో ఖ‌లేజా వ‌చ్చేవ‌ర‌కు మ‌హేష్ డైరీ ఖాళీగానే ఉంది. ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా మ‌హేశ్ బాబుకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అమృతారావు నటించింది. అమృతారావు అప్పటికే బాలీవుడ్ సినిమాల‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే అమృతారావును మ‌హేశ్ బాబుకు జోడీగా సెలక్ట్ చేశారు.

అతిథి సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో మ‌ళ్లీ అమృతారావుకు తెలుగులో అవ‌కాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డింది. అయితే బాలీవుడ్ కు తిరిగి వెళ్లిన త‌ర‌వాత టాలీవుడ్ పై ఈ బ్యూటీ నోరు పారేసుకుంది. అతిథి త‌ర‌వాత త‌న‌కు టాలీవుడ్ లో మూడు సినిమాల్లో ఆఫ‌ర్ లు వ‌చ్చాయ‌ని తెలిపింది. ఆ సినిమాల్లో ఒక‌టి స్టార్ హీరో సినిమా అని చెప్పింది. కానీ ఆ సినిమాలో త‌న రోల్ కేవ‌లం అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మేన‌ని కామెంట్ చేసింది. ఆ సినిమా క‌థ విన్న త‌ర‌వాత‌ ఆ పాత్ర‌కు ఏ మాత్రం ప్రాధాన్య‌త లేదు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

అక్క‌డితే ఆగ‌కుండా అమృతా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంటే క‌మిట్మెంట్ కూడా ఇవ్వాల‌ని అడిగార‌ని… దానికి ఒప్పుకుంటేనే సినిమా అని చెప్పార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దాంతో తాను కోరిక‌లు తీర్చ‌డానికి హీరోయిన్ అవ్వ‌లేద‌ని ఆ విష‌యాన్ని వారికి స్ప‌ష్టంగా చెప్పానని తెలిపింది. త‌న స‌న్నిహితులు టాలీవుడ్ లో రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇస్తార‌ని చెప్పార‌ని..అక్క‌డ స్టార్స్ ప‌క్క‌న ఛాన్స్ కొడితే రెగ్యుల‌ర్ సినిమాలు ఉంటాయ‌ని చెప్పార‌ని తెలిపింది.

అలా చెప్ప‌డంతో తాను మొద‌ట అతిథికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాన‌ని చెప్పింది. తాను న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పింది. ఇక ప్రస్తుతం అమృతారావు ఆర్ జే అన్మూల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటూ భ‌ర్త‌తో ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news