Moviesవారెవ్వా: నాగచైతన్యకు కని విని ఎరుగని బంపర్ ఆఫర్ .. ఇండియన్...

వారెవ్వా: నాగచైతన్యకు కని విని ఎరుగని బంపర్ ఆఫర్ .. ఇండియన్ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ తో సినిమా..!?

యస్.. ఇప్పుడు ఇదే వార్త అక్కినేని అభిమానులో కొత్త జోష్ నింపుతుంది. ఇన్నాళ్లు నాగ చైతన్య ని తక్కువుగా చూసిన జనాలకు..సినిమ ఫ్లాప్ అయితే నవ్విన జనాలకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతున్నాడు నాగ చైతన్య. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా..ఈ అక్కినేని కుర్రాడు మొదటి సినిమాతోనే డిజాస్టర్ గా నిలిచాడు . కానీ ఆ తరువాత రెండో సినిమా ఏ మాయ చేసావే మూవీ తో అభిమానుల అంచనాలను తల కిందులు చేసేశాడు.

ఆ తరువాత కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా.. 100 కోట్ల క్లబ్ లోకి మాత్రం చేరలేకపోయాడు. రీసెంట్ గా వచ్చిన ధ్యాంక్యూ కూడా..నిరాశనే మిగిల్చింది. నెక్స్ట్ వచ్చే సినిమాల లిస్ట్ కూడా పెద్దగా చెప్పుకోతగ్గ..సినిమాలు కావు. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్న టైంలో అద్దిరిపోయే వార్త బయటకి వచ్చింది. ఇలాంటి ఆఫర్ వస్తుందని కనీసం డ్రీమ్‌స్ లో కూడా ఎక్స్ పెక్ట్ చేసిఉండడు నాగ చైతన్య. అలాంటి ఆఫర్ ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒకరు. సంజయ్ సినిమాల్లో టేకింగ్ , విజువ‌లైజేష‌న్ అద్భుతంగా ఉంటాయి.. ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని క‌లిగిస్తాయి. తన అద్భుతమైన టాలెంట్ తో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తెరకెక్కించిన ఈయన డైరెక్షన్ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి క‌లియ‌క‌లో ఓ మూవీ కోసం చ‌ర్చ‌లు జ‌రిగినట్లు బాలీవుడ్ వ‌ర్గాల సమాచారం.

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. నాగ చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో ధూత అనే హార్ర‌ర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. మరో ఇద్దరు బడా డైరెక్టర్స్ ని కూడా లైన్లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. కాగా త్వరలోనే వీరు కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news