Moviesకార్తికేయ 2ని ఆపాలని చూసింది ఆ ఇద్దరు స్టార్ హీరోలా..ఇదేం ట్వీస్ట్...

కార్తికేయ 2ని ఆపాలని చూసింది ఆ ఇద్దరు స్టార్ హీరోలా..ఇదేం ట్వీస్ట్ రా బాబు..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఓ రంగుల ప్రపంచం . అంతేకాదు ఓ కుళ్ళు ప్రపంచం కూడా అంటున్నారు నెటిజన్స్. ఇక్కడ అంతా స్టార్ హీరోలు ,హీరోయిన్లు.. వాళ్ళ వారసులు ఉంటేనే ఇండస్ట్రీలో గౌరవం ఇస్తారు . ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎటువంటి హెల్ప్ లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి తమ టాలెంట్ ద్వారా పైకి రావాలనుకునే వారిని తొక్కిస్తారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరో ఏదో ఒక హీరో నోరు చేసుకొని అరిస్తే ఆ రెండు రోజులు మీడియాలు హైలైట్ అవ్వడం తప్పిస్తే.. దీనికి ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో సొల్యూషన్స్ వెతకలేకపోతున్నారు సినీ పెద్దలమని చెప్పుకునే స్టార్ హీరోలు .


కాగా రీసెంట్ గా హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ మనకు తెలిసిందే. కార్తికేయ 2 సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారని.. ఆయన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని ఎంతోమంది బలవంతం చేశారని ..ఓపెన్ గా చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి . అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది . ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది కార్తికేయ 2. దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఇంతవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జున వందకోట్ల క్లబ్ లోకి చేరలేదు. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్ మాత్రం సొంత టాలెంట్ తో వందకోట్ల క్లబ్ కి ఎంటర్ అవుతున్నాడు.

అయితే కార్తికేయ 2 సినిమాని ఆపడానికి ప్రయత్నించింది ఎవరా..? అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రశ్న ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే దీనిపై నెటిజన్స్ ఊహించుకుంటూ ..అక్కినేని నాగార్జున. హీరో నితిన్ నే.. నిఖిల్ సినిమా తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ నిఖిల్ అభిమానులు మండిపడుతున్నారు. మనకు తెలిసిందే రీసెంట్ గా నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు దిల్ రాజు. ఆ తర్వాత కార్తికేయ సినిమా 2 రిలీజ్ చేద్దామనుకున్న టైంకి హీరో నితిన్ తన మాచర్ల నియోజకవర్గం రిలీజ్ చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ ఇద్దరి హీరోలే నిఖిల్ సినిమాని కావాలని ఆపడానికి ట్రై చేశారని.. నిఖిల్ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి ముందే తెలుసు అని అందుకే భయపడి ఆయన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమన్నారు.. అని అంటూ విపరీతంగా నాగార్జునను హీరో నితిన్ ను ట్రోల్ చేస్తున్నారు నిఖిల్ అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news