Moviesఅభిమానులకు కోపం తెప్పిస్తున్న నయనతార పెళ్లి వీడియో ప్రోమో..ఎందుకంటే..?

అభిమానులకు కోపం తెప్పిస్తున్న నయనతార పెళ్లి వీడియో ప్రోమో..ఎందుకంటే..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నా..ఫ్లాప్స్ చవి చూసినా..ఆ తరువాత మాత్రం మెల్ల్గా తన రూట్ మార్చుకుంటూ..హిట్ ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడు సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేనా, బాలీవుడ్ బ్యూటీస్ కన్నా కూడా ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది.

రీసెంట్ గానే ప్రేమించిన ప్రియుడు అయిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో ఏడు అడుగులు వేసి..ఓ ఇంటిది అయ్యింది. వీళ్ళ పెళ్లి టైంలో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. టాప్ సీక్రేట్ గా షాపింగ్..ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా పెళ్లి పనులు చేసుకుని..తమిళనాడులోని మహాబలిపురంలో..ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకుని..తన కళ ను నెరవేర్చుకుంది. ఇక వాళ్ల పెళ్లికి సంబంధించిన వీడియోలను ఓ డాక్యూమెంటరీగా తెరకెక్కించారు.

ఈ బాధ్యతలను గౌతమ్ మీనన్ వాసుదేవ్ తీసుకున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో గౌతమ్ మీనన్ వాసుదేవ్ దర్శకత్వంలో ఈ డాక్యూమెంటరీ రూపొందింది. ఈ మ్యారేజ్ డాక్యూమెంటరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కొద్దిసేపటి క్రితమే..నయన్-విగ్నేశ్ శివన్ పెళ్ళికి కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ తో ఈ డాక్యూమెంటరీ ప్రోమో ని రిలీజ్ చేసారు. అయితే, ఈ ప్రోమో చాలా షార్ట్ గా ఉంది. దీంతో నయన్ పెళ్లి కోసం ఆశ గా ఎదురుచూసిన అభిమానులు హర్ట్ అయ్యారు. కనీసం మ్యారేజ్ క్లిపింగ్ అయినా యాడ్ చేయచ్చుగా అంటూ మండిపడుతున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు నెట్ ఫిక్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news