Moviesహీరోయిన్ పూర్ణ ముందు ఆ డైరెక్టర్‌తో ప్రేమాయణం నడిపించిందా...?

హీరోయిన్ పూర్ణ ముందు ఆ డైరెక్టర్‌తో ప్రేమాయణం నడిపించిందా…?

సీమ టపాకాయ్, అవును లాంటి సినిమాలతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ఆ తరవాత చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ పూర్ణ సినిమాలు చేసి ఆకట్టుకుంది. సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో ఆ త‌ర్వాత ఆమె బుల్లితెర మీద‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ప‌లు షోల‌కు జ‌డ్జ్‌గా కూడా ప‌నిచేసింది. గ‌తేడాది చివ‌ర్లో వ‌చ్చిన బాల‌య్య అఖండ సినిమాలో క‌థ‌లో కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

అయితే గత కొద్దిరోజులుగా పూర్ణ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతునే ఉన్నాయి. పూర్ణ వ్యాపారవేత్త అసిఫ్ తో ప్రేమలో ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఇక సినిమా ఆఫర్లు తగ్గటంతో తాను లైమ్‌లైట్‌లో ఉండేందుకే మల్లెమాల టివి షోలలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే పూర్ణ అప్పట్లో ఓ డైరెక్టర్ తో లవ్ ఎఫైర్ నడిపింది అంటూ ఇండస్ట్రీ లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రవిబాబు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అవును సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కంటే ముందే వీరి కాంబోలో అవును, అవును 2, లడ్డుబాబు సినిమాలు వచ్చాయి. ఇక వీరి కాంబోలో వరుస సినిమాలు రావడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉంది అంటూ టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. దాంతో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు హీరోయిన్ల‌ సంబంధం ఉండదని అన్నారు.

షూటింగ్ తరవాత వారికి ఫోన్ కూడా చేయను అని చెప్పారు. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని…పూర్ణ నటన చూసి ఆమెకు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు. హీరోయిన్ ల వెంటపడే దర్శకుడిని అయితే ఏ హీరోయిన్ కూడా తనతో సినిమా చేయదు అంటూ వెల్లడించాడు. దాంతో పూర్ణ రవిబాబు లవ్ ఎఫైర్ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news