Movies"సడెన్ గా నన్ను దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికేశాడు".. సంచలన విషయం...

“సడెన్ గా నన్ను దగ్గరకు లాక్కొని బుగ్గ కొరికేశాడు”.. సంచలన విషయం బయటపెట్టిన అనన్యపాండే..!!

ఎస్ ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇన్నాళ్లు సైలెంట్ గా సినీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అనన్య రీసెంట్ గా సినిమా రిలీజ్ అయ్యే 24 గంటల ముందు ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో ఇప్పుడు మీడియాలో అనన్య పాండే మారుమ్రోగిపోతుంది.

స్టార్ డాటర్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనన్య పాండే ప్రజెంట్ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో లైకర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంటి క్రేజియస్ట్ యంగ్ హీరో పక్కన అనన్య లాంటి హాట్ బ్యూటీ జత కడితే ఎలా ఉంటది..? సినిమాలో సీన్స్ అదిరిపోవాల్సిందే. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు లైగర్ పై జనాలు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది . విజయ్ అనన్య పర్ఫామెన్స్ పరంగా బాగున్న.. డైరెక్షన్ పరంగా మెప్పించలేకపోయాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి కారణం పూరి పైన పడింది.

కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య పాండే మాట్లాడుతూ..” ఈ సినిమాలో అవకాశాలు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్న. నాకు ఈ సినిమా మంచి లైఫ్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. సినిమాలో స్పెషల్ రోల్ లో నటించిన మైక్ టైసన్ గురించి చెప్పుకొస్తూ.. సినిమా షూటింగ్ టైంలో అందరూ మైక్ టైసన్ గారితో ఫోటో దిగుతున్నారు. నాకు ఫస్ట్ టైం ఆయనని చూడగానే భయమేసింది. దూరం దూరంగానే ఉన్నాను .

కానీ అందరూ ఆయనతో ఫోటోలు దిగుతుంటే నాకు కూడా ఓ స్వీట్ మెమోరీలా ఉంటుంది అని ఆయన దగ్గరికి వెళ్లి ఫోటో తీసుకోవడానికి నిలుచున్నాను . అప్పుడే కెమెరా మ్యాన్ ఏదైనా ఫన్నీ ఫొజ్ పెట్టండి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే మైక్ టైసన్ గారు నన్ను గట్టిగా దగ్గరికి లాక్కొని వెంటనే టక్కున నా బుగ్గ కొరికేసాడు. దీంతో నేను షాక్ అయిపోయాను . కానీ ఆయన చాలా సరదా మనిషి అని.. చాలా సరదాగా ఉంటారని తెలిసింది. ఆయనను కలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news