Moviesహవ్వా .. అలాంటి లింకులు పెట్టడంలో త్రివిక్రమ్ తరువాతే ఎవ్వరైనా....?

హవ్వా .. అలాంటి లింకులు పెట్టడంలో త్రివిక్రమ్ తరువాతే ఎవ్వరైనా….?

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాంటి కాంబోలను సెట్ చేయడంలో మాటల మాంత్రికుడు తరువాతే ఎవ్వరైన అని చెప్పక తప్పదు. క్రేజీ క్రేజీ కాంబోలు సెట్ చేయదంలో త్రివిక్రమ్ ధిట్ట. అంతేకాదు..అలాంటి క్రేజీ కాంబోలతోనే సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఘనత..గురూజీ కి ఉంది.

ప్రజెంట్ మాటల మాంత్రికుడు అలాంటి ఓ క్రేజీ కాంబోని సెట్ చేసిన్నట్లు తెలుస్తుంది. త్వరలో నే సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ బాబు , త్రివిక్రమ్ మూవీలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర..మహేశ్ కు తండ్రిగా నటిస్తున్నారట. ఈ చిత్రం లో మహేశ్ కి సమానమైన రోల్ గా ఆయన తండ్రి పాత్ర ఉంటుందని..అందుకే ఈ రోల్ ని ఉపేంద్ర యాక్సెప్ట్ చేసిన్నట్లు తెలుస్తుంది.

నిజానికి మహేశ్ కంటే ఉపేంద్ర ఏడేళ్లు మాత్రమే పెద్దవాదు. అలాంటి అతన్ని మహేశ్ కు ఏకంగా తండ్రి పాత్రలో జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోనూలేదు. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేష్ చేయనున్న మూవీ కావడంతో మేకర్స్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మూవీని ప్రత్యేకంగా చూస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ రూపొందించిన బన్ని హీరో గా నటించిన సన్నాఫ్ సత్యమూర్తిసినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సినిమా హిట్ కి సగం క్రెడిట్ ఆయనకే వేశారు జనాలు. మరి మహేస్ సినిమాతో ఎలాంటి పేరు సంపాదించుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news