Moviesరమ్యకృష్ణ-కృష్ణవంశీ విడాకుల వార్త వెనుక ఉన్న ఆ బొద్దు హీరోయిన్.. అసలు...

రమ్యకృష్ణ-కృష్ణవంశీ విడాకుల వార్త వెనుక ఉన్న ఆ బొద్దు హీరోయిన్.. అసలు కధ ఇదా..!!

సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ జంటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిర్ ..”రమ్యకృష్ణ-కృష్ణవంశీ” అనే చెప్పాలి. తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు వెళ్లిపోయారు. కానీ గత నాలుగు దశాబ్దాలుగా తన అందచందాలతో సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న నటి మాత్రం రమ్య కృష్ణ ఒక్కరే. ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. స్టార్ హీరోయిన్ గా ఎదిగారు వెళ్ళిపోయారు. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సీనియర్ నటి రమ్యకృష్ణలా మాత్రం ఈ తరం హీరోయిన్లలో ఎవరు లేరు అనే చెప్పలి.

1980 ల్లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన‌ రమ్యకృష్ణ తన అందచందాలతోనే కాదు … అభినయంతో కూడా కేవలం తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా సౌతిండియా సినీ పరిశ్రమను కూడా ఒక మకుటంలేని మహారాణిగా ఏలేసింది.పెళ్ళికి ముందు రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్ర‌లేఖ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది. నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. ఆ టైంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని..ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణాలు ఉన్నాయి. అప్పట్లో కృష్ణ వంశీ ఓ స్టార్ హీరోయిన్ ఛార్మి తో చాలా చనువుగా ఉంటున్నాడని..అందుకే రమ్య విడాకులు ఇవ్వాలి అనుకుందని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే..అప్పుడు రమ్య చెన్నైలో ఉండేది..కృష్ణ వంశీ హైదరబాద్ లో ఉండేవాడు. సో..అలా గ్యాప్ రావడంతో ఇద్దరి మధ్యలోకి దూరింది ఛార్మి..అని పుకార్లు వైరల్ అయ్యింది.

రీసెంట్ గా ఆయన తన చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ…తమ విడాకుల పై వచ్చిన వార్తలను ఖండించారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగమర్తాండ’.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన తన వైవాహిక జీవితానికి సంబంధించి వస్తోన్న రూమర్స్‌పైనా స్పందించారు. పబ్లిక్‌ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు కామన్. మేం సీరియస్ గా తీసుకోం.. పెద్దగా పట్టించుకోం. అందుకే లైట్ తీసుకుంటా,. జస్ట్‌ నవ్వి ఊరుకుంటాం’ అంతే అంటూ చెప్పుకొచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news