MoviesNBK 107 : షూటింగ్ స్పాట్ నుండి టైటిల్ సాంగ్ క్లిప్...

NBK 107 : షూటింగ్ స్పాట్ నుండి టైటిల్ సాంగ్ క్లిప్ లీక్..ఇరగదీసిన బాలయ్య(వీడియో)..!!

నందమూరి నట సింహం బాలయ్య ప్రజెంట్ నటిస్తున్న మూవీ NBK107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈయన..ఇప్పుడు గోపీచంద్ మల్లినేని సినిమా తో మరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లో హీరోయిన్ గా స్టార్ శృతి హాసన్ నటిస్తుంది.

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.అలాగే బాల‌కృష్ణను మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో మెలితిప్పిన మీసాల లుక్‌లో చూడ‌బోతున్నాం. నిజ ఘ‌ట‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాల‌కృష్ణ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, లుక్స్ , టీజర్ లో బాలయ్య విజృంభించేశాడు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అలంపూర్ లో జరుగుతుంది.

అక్కడ బాలయ్య షూటింగ్ స్పాట్ లో ఉండే కొన్ని పిక్స్ నెట్టింట్ లీకై తెగ హల్ చల్ చేస్తున్నాయి. వైట్ అండ్ వైట్ లుక్ లో బాలయ్య..తన గత తాలుకా బ్లాక్ బస్టర్ సినిమాలని గుర్తు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఓ వీడియో క్లిప్ కూడా లీకైంది. ఈ వీడియో సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ..లీక్ చేసారు అక్కడ ఉండే జనాలు. జనాల మధ్యలో బాలయ్య..”జై బాలయ్య” అంటూ సాగే లిరిక్స్ లో అలా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నడుచుకుంటూ వస్తుంటే..సూపర్బ్ గా ఉంది . ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news