Moviesవిజ‌య్ - ర‌ష్మిక ల‌వ‌ర్స్ అని ఫిక్స్ అవ్వ‌డానికి 2 కార‌ణాలు...

విజ‌య్ – ర‌ష్మిక ల‌వ‌ర్స్ అని ఫిక్స్ అవ్వ‌డానికి 2 కార‌ణాలు ఇవే…!

ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత సోలో హీరోగా పెళ్లి చూపులు సినిమాలో నటించాడు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా వచ్చిన పెళ్లి చూపులు క్లాస్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ద్వారక, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి సినిమాలు చేశాడు. అయితే, టాక్సీవాలా కంటే తర్వాత రావాల్సిన అర్జున్ రెడ్డి సినిమా ముందు వచ్చింది. అది సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా విజయ్ రౌడీ స్టార్‌గా అసాధారణమైన పాపులారిటీని సాధించాడు.

అంతేకాదు, పెద్ద స్టార్ హీరో అయ్యాడు. దాంతో గీత గోవిందం సినిమా చేసే అవకాశం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌తో చేసిన రొమాన్స్ పెట్టుకున్న లిప్ కిస్సులు మిగతా సినిమాలలోనూ అభిమానులు ఆశించడం మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం ఇంకా పోలేదని చెప్పక తప్పదు. అందుకే, క్లాస్ మూవీ అయినా కూడా గీత గోవిందం సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నతో లిప్ కిస్ పెట్టారు. ఇది మరీ మాస్ రేంజ్‌లో లేకపోయినా కూడా అదిరిపోయింది. కొన్ని సెకండ్ల కిస్ అయినా కూడా సినిమా మొత్తం దాన్ని ఆధారంగా చేసుకొనే కథ అల్లారు.

ఇక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల మధ్య ఉన్న పెదవి ముద్దులు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలో శాలినీ పాండేతో అన్ని పెదవి ముద్దులున్నా కూడా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు కలిసి చేయడంతో ఇద్దరి మధ్య డీప్‌ లవ్ ఉందని..సీక్రేట్ గా ప్రేమాయణం సాగిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఇంకొన్ని బలంగా తోడయ్యాయి. హిందీ సినిమాల కోసం రష్మిక ముంబై వెళ్ళినప్పుడల్లా కలుసుకుంటున్నారు.

విజయ్ లైగర్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రష్మికని కలుసుకొని ఇద్దరూ కలిసి డిన్నర్ అంటూ రోడ్ల మీద కనిపించారు. అందుకే, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో ఇద్దరూ ఇప్పటి వరకూ స్పందించలేదు. కాగా, రష్మిక ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయి సినిమాల కోసం క్యాన్సిల్ చేసుకుంది. ఇక మన రౌడీ హీరో అంత దూరం వెళ్ళలేదు గానీ, బాలీవుడ్ హీరోయిన్స్ కూడా వెంపర్లాడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news