Moviesనా పేరు సీసా రామారావు ఐటెం సాంగ్ అదిరింది... క‌ళ్ల‌కు అందాల...

నా పేరు సీసా రామారావు ఐటెం సాంగ్ అదిరింది… క‌ళ్ల‌కు అందాల విందే ( వీడియో)

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హిట్టు.. ప్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాడు. క్రాక్ లాంటి కం బ్యాక్ సినిమా త‌ర్వాత ఖిలాడీ చేశాడు. ఈ సినిమా ఘోరంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న్నేసింది. ఖిలాడీ త‌ర్వాత ఇప్పుడు నాలుగైదు ప్రాజెక్టులు ర‌వితేజ చేతిలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ర‌వితేజ నుంచి తాజాగా వ‌స్తోన్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శ‌ర‌త్ మండ‌వ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది.

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వ‌స్తున్నారు. తాజాగా అదిరిపోయే ఐటెం సాంగ్‌కు సంబంధించిన ప్రోమో వ‌చ్చింది. ఈ సాంగ్ ఖ‌చ్చితంగా సినిమాకు హైలెట్‌గా ఉంది. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట నా పేరు సీసా అంటూ స్టార్ట్ అవుతుంది. సామ్ సీఎస్ పెప్సీ ట్యూన్ అందించారు. ఈ ఐటెం సాంగ్‌కు అన్వేషి జైన్ గ్లామ‌ర్ తోడైంది.

ఇక ప్రోమో చూస్తుంటేనే ఖ‌చ్చితంగా సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌న్న అంచ‌నా అయితే ఉంది. మాస్‌కు ఈ సాంగ్ మాంచి విజువ‌ల్ ఫీస్ట్‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్‌, హీరోయిన్లుగా చేస్తున్నారు. సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ రెండు పాట‌లు మెలోడీ హిట్స్‌గా నిలిచి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. మ‌రి ఈ సినిమాతో ర‌వితేజ మ‌రో హిట్ అందుకుంటాడా ? లేదా ? అన్న‌ది ఈ నెల 29న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news