Movies' ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ' ఫ‌స్ట్ షో టాక్‌... మారుతి రాడ్...

‘ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ‘ ఫ‌స్ట్ షో టాక్‌… మారుతి రాడ్ దింపేశాడ్రా…!

గోపీచంద్ – రాశీ ఖన్నా జంటగా నటించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గోపీచంద్ చాలా రోజుల నుంచి స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ విష‌యానికి వ‌స్తే జీఏ 2 బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాస్‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించ‌డంతో పాటు మారుతి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. దీనికి తోడు సినిమాకు ముందే రిలీజ్ అయిన టీజ‌ర్‌తో పాటు రెండు ట్రైల‌ర్లు కొత్త‌గా ఉండ‌డంతో సినిమాలో ఏదో విష‌యం ఉంద‌న్న హైప్ అయితే వ‌చ్చింది.

దీనికి త‌గిన‌ట్టుగా ఏపీ, తెలంగాణ‌లోనే ఈ సినిమాకు రు. 15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. ఇక ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఇప్ప‌టికే కొన్ని చోట్ల కంప్లీట్ అయ్యాయి. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం చూస్తే సినిమాకు ఊహించ‌ని విధంగా మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. త‌క్కువ మంది మాత్ర‌మే సినిమా ఓకే అంటుంటే.. ఎక్కువ మంది మాత్రం వ‌ర‌స్ట్ మూవీ అని కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఫ‌స్టాఫ్ మొత్తం ప్రేక్ష‌కుల‌కు పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో పాటు క‌థ‌లోకి తీసుకు వెళ్లేందుకే టైం తీసుకున్నాడ‌ట‌. ఇక్క‌డే చాలా టైం వేస్ట్ అయ్యిందంటున్నారు. ఇక హీరో – హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్ర‌క్ ఫ‌స్టాఫ్‌లో ఉన్నా అది కూడా ఎక్కువ టైం టేకింగ్‌కే ప‌ట్టిందంటున్నారు. ఇక సెకండాఫ్ మాత్రం మిస్ట‌రీ కేసును చేధించడంతో కాస్త ఉత్కంఠ‌తో ముందుకు వెళ్లిందంటున్నారు.

ఇక సోష‌ల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్ల ప్ర‌కారం చూస్తే గోపీచంద్‌, రాశీఖ‌న్నాతో పాటు మిగిలిన న‌టులు న‌ట‌నా ప‌రంగా బాగా చేశార‌నే అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్ర‌ఫీతో పాటు టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. అయితే మారుతి కామెడీ పేల‌క‌పోవ‌డంతో పాటు, థ్రిల్ మిస్ కావ‌డం.. లాజిక్ లేని సీన్లు ఈ సినిమాకు మెయిన్ మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు.

ఓవ‌రాల్‌గా చూస్తే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ కామెడీతో కూడిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని తెలుస్తోంది. గోపీచంద్ మార్క్ యాక్ష‌న్‌కు, మారుతి మార్క్ కామెడీ మిక్స్ చేసి ఈ సినిమా తెర‌కెక్కించినా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని.. రాడ్ దింపేశాడ‌నే ఎక్కువ మంది అంటున్నారు. మ‌రి పూర్తి రివ్యూ వ‌స్తే కాని ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ స‌త్తా ఏంటో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news