Moviesబాల‌య్య ప్ర‌తి రోజు ఆ ప‌ని చేయ‌కుండా నిద్ర‌పోడా.. ముర‌ళీమోహ‌న్ సంచ‌ల‌న...

బాల‌య్య ప్ర‌తి రోజు ఆ ప‌ని చేయ‌కుండా నిద్ర‌పోడా.. ముర‌ళీమోహ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఎక్క‌డ ఉంటే గౌర‌వం అక్క‌డ ఉండాల్సిందే. ఆయ‌న ఇత‌రుల నుంచి గౌర‌వాన్ని ఎలా కోరుకుంటారో ? త‌న తోటివాళ్ల‌కు పెద్ద‌ల‌కు అంతే గౌర‌వం ఇస్తారు. బాల‌య్య‌ను చాలా మంది హీరోయిన్లు ఇత‌ర హీరోలు, స్టార్ హీరోల‌తో పోలిస్తే ఎక్కువుగా లైక్ చేయ‌డానికి కార‌ణం మ‌హిళ‌ల‌ను ఎక్కువుగా గౌర‌వించ‌డ‌మే. మ‌హిళ‌ల‌కు షూటింగ్ ప‌రంగా ఎలాంటి ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఉండ‌కూడ‌దు అన్న‌దే బాల‌య్య సిద్ధాంతం.

ఇక బాల‌య్య బ‌య‌ట ఏ ఫంక్ష‌న్ల‌లో అయినా, సినిమా కార్య‌క్ర‌మాలు అయినా.. చివ‌ర‌కు తాను హోస్ట్ చేసి సూప‌ర్ హిట్ అయిన అన్‌స్టాప‌బుల్ షో అయినా కూడా మా నాన్న గారు అంటూ ఆ న‌ట‌సౌర్వ‌భౌమ ఎన్టీఆర్‌ను త‌ల‌చుకుంటూ ఉంటాడు. మ‌నం మ‌న త‌ల్లిదండ్రుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అలా త‌ల‌చుకోవ‌డం మంచి విష‌యం. అయితే అంద‌రు హీరోలు అలా చేయ‌రు. ఇదే విష‌యంపై సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ కూడా త‌న తాజా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పారు.

బాల‌య్య ప‌దే ప‌దే నాన్న గారు అలా.. నాన్న గారు ఇలా అని చెపుతూ ఉంటాడ‌ని.. షూటింగ్ టైంలో గ్యాప్ వ‌స్తే నాన్న గారు అంటూ ఆ రోజు అంటూ ప‌దే ప‌దే ఎన్టీఆర్ సంఘ‌ట‌న‌లు, స్మృతులు గుర్తు చేసుకుంటార‌ని.. రోజు ఓ 100 సార్లు బాల‌య్య ఎన్టీఆర్ పేరు ప‌లుకుతార‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా ఇప్ప‌టి త‌రం హీరోలు ఎవ‌రైనా తాను ఆ సినిమాలో అలా చేశాను.. ఈ సినిమాలో ఇలా చేశాను అంటూ వాళ్ల గురించి వాళ్లే చెప్పుకుంటారు.. కానీ బాల‌య్య మాత్రం ప‌దే ప‌దే తండ్రి సినిమాలు, పాత్ర‌లే గుర్తు చేసుకుంటార‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

ఇక బాలీవుడ్ నుంచి వ‌చ్చే హిందీ హీరోయిన్లు, న‌టుల‌కు కూడా ఎన్టీఆర్ సినిమాల గురించి.. క్ర‌మ‌శిక్ష‌ణ గురించే చెపుతుంటార‌ని.. ఇక ప్రతి రోజు రాత్రి ప‌డుకునే ముందు ఖ‌చ్చితంగా ఎన్టీఆర్ సినిమాలు, సాంగ్స్ చూసిన త‌ర్వాతే ప‌డుకుంటాడ‌ని కూడా ముర‌ళీ మోహ‌న్ చెప్పారు. ఎన్టీఆర్ అంటే బాల‌య్య‌కు ఎంతో ఇష్టం, ప్రేమ అన్న‌ది చెప్పేందుకు ఇంత‌కు మించిన నిద‌ర్శ‌నం ఏం ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news