Moviesన‌రేష్‌కు అన్నం కూడా పెట్ట‌లేదా... ర‌మ్య ర‌ఘుపతి గురించి సంచ‌ల‌న నిజాలు..!

న‌రేష్‌కు అన్నం కూడా పెట్ట‌లేదా… ర‌మ్య ర‌ఘుపతి గురించి సంచ‌ల‌న నిజాలు..!

సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ – ప‌విత్రా లోకేష్ వ్య‌వ‌హారం ఇప్పుడు మీడియాలో ఎంత అల్ల‌రి అవుతుందో చూశాం. ఈ వ్య‌వ‌హారంలోకి అటు న‌రేష్ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి, ఇటు ప‌విత్రా లోకేష్ భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ ఎంట‌ర్ కావ‌డంతో ఇంకాస్త ర‌చ్చ‌కెక్కింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే తాజాగా బెంగ‌ళూరులో జ‌రిగిన వ్య‌వ‌హారంలో వీళ్లు త‌మ విష‌యాల‌ను మ‌రింత బ‌జారుకీడ్చుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది.

అయితే ఈ ర‌చ్చ‌పై న‌రేష్‌కు చెల్లి అయిన న‌టీమ‌ణి పూజిత స్పందించారు. ఈ క్ర‌మంలోనే ర‌మ్య ర‌ఘుప‌తిపై పూజిత చాలా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు. ర‌మ్య – న‌రేష్ దంప‌తుల‌కు పెళ్లయ్యి 10 ఏళ్లు అయ్యింద‌ని.. అయితే బాబు పుట్టిన వెంట‌నే ర‌మ్య గురించి అస‌లు నిజం తెలియ‌డంతో బ‌య‌ట పెట్టేశాడ‌ని.. వీళ్లు విడిపోయే ఇప్ప‌టికే 8 సంవ‌త్స‌రాలు అయ్యింద‌ని పూజిత చెప్పారు.

పెళ్ల‌యిన రెండేళ్ల‌కే న‌రేష్‌కు చివ‌ర‌కు అన్నం కూడా పెట్ట‌కుండా ర‌మ్య చాలా ఇబ్బందులు పెట్టింద‌న్నారు. ఓ రోజు న‌రేష్ లేట్ నైట్ రాత్రి 11 గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చి అన్నం పెట్ట‌మ‌ని అడిగితే.. అప్పుడు ర‌మ్య నేను పాత త‌రం అమ్మాయిల్లా నువ్వు ఎప్పుడు ఇంటికి వ‌స్తే అప్పుడు నెత్తిమీద కొంగు వేసుకుని వ‌చ్చి నువ్వు చెప్పిన‌ట్టు చేసే అమ్మాయిని కాదు.. ఈ త‌రం అమ్మాయిను అని క‌నీసం అన్నం కూడా పెట్ట‌లేద‌ని న‌రేష్‌ను మాన‌సికంగా ఇబ్బంది పెట్టింద‌ని తెలిపారు.

 

ఆ త‌ర్వాత న‌రేష్‌ను ఆస్తితో పాటు అనేక విధాలా టార్చ‌ర్ పెట్ట‌డంతో ఆయ‌న విసిగిపోయి ఆమెకు దూర‌మైపోయాడ‌న్నారు. న‌రేష్ పేరు చెప్పుకుని బ‌య‌ట చాలా అప్పులు చేసింద‌ని.. ఆమెకు అప్పులు ఇచ్చిన వాళ్లు అంద‌రూ న‌రేష్ గారి ఇంటికి వ‌చ్చి అర్థ‌రాత్రి సెక్యూరిటీ ఉన్నా కూడా గోడ‌లు దూకేసి లోప‌ల‌కు వ‌చ్చి నానా ర‌చ్చ చేశార‌ని కూడా పూజిత చెప్పింది.

ఇక తాను న‌రేష్ ఇంట్లోనే ఉంటున్నాన‌ని ర‌మ్య చెపుతోంద‌ని.. తాను ఆయ‌న ఇంటికి చాలా సార్లు వెళ్లినా ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌లేద‌ని కూడా పూజిత బ‌య‌ట పెట్టింది. విజ‌య‌నిర్మ‌ల గారు చ‌నిపోయిన‌ప్పుడు ఒక్క 10 నిమిషాలు మాత్ర‌మే ఆమె ఆ ఇంట్లో ఉంద‌ని.. త‌ర్వాత ఆమె క‌నిపించ‌లేద‌ని కూడా పూజిత చెప్పింది. ఆమె విష‌యంలో ఎన్నోసార్లు ఓపిక ప‌ట్టినా చివ‌ర‌కు విసిగిపోయి న‌రేష్ ఆమెను దూరం పెట్ట‌డంతో పాటు ఆమె చేస్తోన్న అప్పుల‌తో పాటు ఆమెతో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని కూడా పూజిత చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news