Moviesపెను ప్ర‌మాదంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ... సంక్షోభం త‌ప్ప‌దా...!

పెను ప్ర‌మాదంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ… సంక్షోభం త‌ప్ప‌దా…!

ఎస్ ఇప్పుడు ఈ మాటే అంద‌రి నోటా వినిపిస్తోంది. టాలీవుడ్ త్వ‌ర‌లోనే పెను ప్ర‌మాదంలో ప‌డబోతోందా ? ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో మార్పు లేక‌పోతే ఇండ‌స్ట్రీలో సంక్షోభం త‌ప్ప‌దా ? మ‌నంపేరుకు మాత్ర‌మే పాన్ ఇండియా స్థాయి అని చెప్పుకుంటున్నా అవ‌న్నీ పైపై మెరుగులేనా ? లోప‌ల మాత్రం మ‌న ఇండ‌స్ట్రీ పేలిపోవ‌డానికి గాలిబుడ‌గ మాదిరిగా ఉందా ? అంటే అవున‌నే చెప్పాలి.

తాజాగా వ‌చ్చిన నేచుర‌ల్ స్టార్ నాని అంటే సుందరానికి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా 40 శాతం న‌ష్టాలు త‌ప్పేలా లేవు. జ‌నాలు ఈ సినిమా చూడ‌లేదు. మేజ‌ర్ సినిమా హిట్ అన్నారు.. అంతా కలిపితే రు. 30 కోట్ల వ‌సూళ్లు.. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రాలేదు. అయితే ఈ సినిమాను త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసి.. త‌క్కువ రేట్ల‌కు అమ్మ‌డ‌మే ప్ల‌స్ అయ్యింది.

ఇక విశ్వ‌క్‌సేన్ న‌టించిన అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా సూప‌ర్ అన్నా క‌లెక్ష‌న్లు లేవు. ఇక విరాట‌పర్వం అదిరిపోయింద‌ని అంద‌రూ ఒప్పుకున్నారు. అయితే ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ వ‌సూళ్లు రు. కోటి కూడా లేవు. అస‌లు దీనిని బ‌ట్టి చూస్తే జ‌నాలు థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. స‌ర్కారు వారిపాట‌, ఎఫ్ 3 సినిమాలు అదిరిపోయాయ‌న్నారు. కానీ ఈ రెండు సినిమాల‌కు రు. 10 కోట్ల చొప్పున న‌ష్టాలు త‌ప్ప‌లేదు.

పై సినిమాలు కొన్న వాళ్లు… తీసినోళ్లు కూడా హిట్ అని పైకి చెప్పుకుని మురిసిపోతున్నా.. న‌ష్టాల‌తో లోప‌ల మాత్రం కుమిలిపోతున్నారు. ఈ విప‌రీత పోక‌డ‌కు కార‌ణం క‌రోనా త‌ర్వాత అంద‌రూ తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని ప్ర‌భుత్వాల‌తో పోరాటాలు చేసిమ‌రి టిక్కెట్ రేట్లు పెంచేలా చేసుకున్నారు. దీనికి తోడు పెద్ద సినిమాలు అంటూ స్పెష‌ల్ రేట్లు తెచ్చుకున్నారు. దీంతో ఈ పెరిగిన రేట్లు చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

తెలంగాణ మల్టీఫ్లెక్స్‌ల్లో టిక్కెట్ రేటు ఏకంగా రు. 350గా ఉంది. ఏపీలోనూ దాదాపు రు. 295కు పైనే ఉంది. అస‌లు ఇంతంత రేట్లు పెడితే జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు ? వ‌స్తారు ? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్పుడు నాని లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాల‌కు కూడా టిక్కెట్ రేట్లు పెంచ‌డంతో అస‌లు ఈ సినిమా చూసేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదు. ఎఫ్ 3 సినిమాకు టిక్కెట్ రేట్లు త‌గ్గించామ‌ని చెప్పినా కూడా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు.

ఎంతో బ‌జ్ ఉండి.. సూప‌ర్ హిట్ అంటే త‌ప్పా జ‌నాలు ఇళ్లు విడిచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. వారం రెండు వారాలు ఆగితే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంద‌నే ఆశ‌ల‌తో ఉన్నారు. త్రిబుల్ ఆర్ సినిమాకు అంత రేట్లు పెడితే వ‌చ్చింది రు. 1150 కోట్లు. ఆచార్య‌ను అస్స‌లు ఫ‌స్ట్ డే చూసేందుకే ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే ఈ విషయంపై ఇప్పుడిప్పుడే నిర్మాత‌లు క‌ళ్లు తెరుస్తున్నారు. పెద్ద నిర్మాత అల్లు అర‌విందే గోపీచంద్ సినిమాకు టిక్కెట్ రేట్లు త‌గ్గించేశారు.

అఖండ సినిమా రిలీజ్ అప్పుడు టిక్కెట్ రేట్లు త‌క్కువ‌గానే ఉన్నాయి. కానీ ఆ సినిమా ఎంతలా ఆడింది.. ఏ స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టిందో చూశాం. ఇప్ప‌ట‌కి అయినా మ‌నోళ్లు క‌ళ్లు తెరిచి టిక్కెట్ రేట్లు త‌గ్గించి ఎక్కువ మందిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా చేయాలి. లేక‌పోతే ఇక థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్‌లు మూసుకునే రోజులు కూడా ద‌గ్గ‌ర్లోనే ఉంటాయి. ఇక అప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమాకు అయినా ఓటీటీయే దిక్క‌వుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news