Moviesబండ్ల గ‌ణేష్‌ను మోసం చేసింది ఎవ‌రు... ఆ మాట‌ల అర్థం అదేనా..!

బండ్ల గ‌ణేష్‌ను మోసం చేసింది ఎవ‌రు… ఆ మాట‌ల అర్థం అదేనా..!

ప‌వ‌న్ క‌ళ్యాన్ వీర‌భ‌క్తుడు ప్ర‌ముఖ నిర్మాత బండ్ల గ‌ణేష్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. బండ్ల తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తీవ్ర నిరాశ‌, నిస్పృహ‌ల‌తో బండ్ల మాట‌లు ఉన్నాయి. జీవితంలో ఎవ్వ‌రిని న‌మ్మొద్దు అని కూడా బండ్ల వార్నింగ్ ఇచ్చాడు. జీవితంలో ఎవ‌రిని అయినా న‌మ్మితే మోస‌పోతారు… న‌మ్మ‌క‌పోతే పోయేదేమి లేద‌ని ఆయ‌న చెప్పారు.

బండ్ల విడుద‌ల చేసిన వీడియోలో జీవితంలో మ‌నం ఎవ్వ‌రిని న‌మ్మ‌వ‌ద్దు.. మ‌న‌ల‌ను మ‌న‌మే న‌మ్ముకుందాం.. మ‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల‌నే న‌మ్ముకుందాం.. మ‌న త‌ల్లిదండ్రుల‌ను ప్రేమిద్దాం.. మ‌న‌ల్నిన‌మ్మి వ‌చ్చిన భార్య‌ను ప్రేమిద్దాం.. మ‌నం జ‌న్మ‌నిచ్చిన పిల్ల‌ల‌ను ప్రేమిద్దాం.. వాళ్ల‌కు మంచి భ‌విష్య‌త్తు ఇద్దాం… మ‌న‌ల‌ను క‌న్న త‌ల్లిదండ్రుల‌కు మంచి జీవితాన్ని ఇద్దాం.. మ‌న‌పై వాళ్లు కోటి ఆశ‌ల‌తో ఉన్నారు… మ‌న పిల్ల‌ల‌కు మంచి దారిలో చూపిద్దాం… వాళ్ల‌, వీళ్ల మోజులో ప‌డి.. మ‌న పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల‌కు అన్యాయం చేయ‌వ‌ద్దు మీ బండ్ల గ‌ణేష్ అని ఆయ‌న చెప్పారు.

బండ్ల ఒక్క‌సారిగా ఇంత నిరాశ‌కు ఎందుకు గుర‌య్యాడు ? బండ్ల మాట్లాడితేనే ముందుగా ప‌వ‌న్ మాటే వ‌స్తుంది. ప‌వ‌న్ భ‌క్తుడిగా బండ్ల మారిపోయాడు… అలాంటిది ఇప్పుడు త‌న ఫ్యామిలీ, పిల్ల‌లు అంటూ చెప్ప‌డంతో పాటు ఎవ్వ‌రిని న‌మ్మ‌వ‌ద్ద‌ని అన‌డం.. అస‌లు పవ‌న్ ప్ర‌స్తావ‌నే తీసుకు రాక‌పోవ‌డంతో చాలా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో కొంద‌రు అయితే ప‌వ‌న్ వ‌ల్లే బండ్ల మోసపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు.. రాజ‌కీయాలు అంటూ బిజీగా ఉన్నారు. బండ్ల బ్యాన‌ర్లోనే ప‌వ‌న్ తీన్‌మార్‌, గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి త‌న బ్యాన‌ర్లో సినిమాకు ప‌వ‌న్ డేట్లు ఇస్తాడని బండ్ల ఎప్ప‌టి నుంచో చాలా న‌మ్మ‌కంతో ఉన్నాడు. అయితే ప‌వ‌న్ ఇప్ప‌టికే ఒప్పుకున్న క‌మిట్‌మెంట్లు చాలా ఉన్నాయి.

అస‌లు అవే ఎప్ప‌ట‌కీ పూర్త‌వుతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో బండ్ల గ‌ణేష్ బ్యాన‌ర్లో సినిమా చేయ‌డం అంటే మ‌రో మూడు నాలుగేళ్ల వ‌ర‌కు జ‌రిగే ప‌నికాద‌నే అర్థ‌మ‌వుతోంది. అస‌లు బండ్ల కోపానికి ప‌వ‌నే కార‌ణ‌మా ? ప‌వ‌నే కార‌ణ‌మైతే ఇదే కార‌ణ‌మా ? లేదా వేరే ఎవ‌రైనా ఉన్నారా ? అన్న‌ది ఇప్పుడు ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. అయితే నెటిజ‌న్లు మాత్రం ప‌వ‌నే అని అంటున్నారు. మ‌రి బండ్ల దీనిపై క్లారిటీ ఇస్తే కానీ ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news