Moviesకొరటాలకు తారక్‌పై పెరిగిన కసి, ప్రేమ..అందుకే NTR 30 కోసం... !

కొరటాలకు తారక్‌పై పెరిగిన కసి, ప్రేమ..అందుకే NTR 30 కోసం… !

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి దూరంగా ఉండే హీరోలలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒకరు. పేరుకే జూనియర్ ఎన్.టి.ఆర్. తన సినిమాలతో ఇప్పటికే సాధించుకున్న క్రేజ్ ఆకాశమంత అని చెప్పక తప్పదు. స్టూడెంట్ నంబర్ 1లో ఒక్కడిగా, అదుర్స్‌లో ఇద్దరుగా, జై లవ కుశలో ముగ్గురుగా ఎన్.టి.ఆర్ నటన మహాద్భుతం. ఎన్ని పాత్రలలోనైనా అదరగొట్టగల నటుడు ఎన్.టి.ఆర్ అని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు..సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఉదాహరణ ఇంకేం కావాలి.

దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్నాడా..ఇలాంటి సమయమలో తనతో సినిమా చేస్తే నా కెరీర్‌కు ఇబ్బందులు తలెత్తుతాయేమో..అనవసరంగా రిస్క్ చేస్తున్నానేమో..ఇలాంటి సందేహాలు ఏవీ పెట్టుకోకుండా కథ నచ్చితే..చేసేద్దాం.. అని మాటిచ్చే రకం యంగ్ టైగర్. సినిమా పోయిందని తెలిసినా దర్శకుడు గురించి ఎక్కడా నెగిటివ్ కామెంట్స్ చేయరంటే ఆయనది ఎలాంటి వ్యక్తిత్వమో అర్థం చేసుకోవచ్చు. దీనికి ఉదాహరణ కూడా చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ఆంధ్రావాలా అనే సినిమా చేశారు.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో రక రకాలుగా మాట్లాడుకున్నారు. నందమూరి అభిమానులు పూరిని కూడా కామెంట్స్ చేసిన సందర్భం అది. అయినా తారక్ నవ్వుతూ ఉన్నారు తప్ప సినిమా పోయిందని..పూరిని నిందించలేదు. పైగా నీకు నచ్చి నాకు కథ చెప్పావ్..నాకు నచ్చి చేశాను. రిజల్ట్ మన చేతిలో లేదు కదా..ఇంకో మంచి హిట్ సినిమా చేద్దాం ..అని అన్నారంటే ఇది బహుషా తారక్‌కు మాత్రమే దర్శకుడి మీద ఉండే నమ్మకం అభిమానం.

అందుకే, ఆ తర్వాత పూరితో టెంపర్ సినిమా చేసి సాలీడ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే మళ్ళీ కొరటాల శివ విషయంలో రిపీట్ అయింది. అయితే, ఇక్కడ కొరటాల తారక్‌కు ఫ్లాపివ్వలేదు. ఆయన చేసిన మెగా మల్టీస్టారర్ ఆచార్య పెద్ద డిజాస్టర్. అప్పటికే ఎన్.టి.ఆర్ 30ని కొరటాలతో కమిటై అఫీషియల్‌గానూ ప్రకటన వచ్చేసింది. ఇంకో హీరో అయితే, నెమ్మదిగా ప్రాజెక్ట్‌ను కొన్నాళ్ళు హోల్డ్‌లో పెట్టి..ఆ తర్వాత సైడయ్యేవాడు. కానీ, తారక్ దర్శకుడిలో ఉన్న సత్తా, టాలెంట్‌ను మాత్రమే నమ్ముతారు.

అందుకే ఆచార్య ఫ్లాప్ తర్వాత రక రకాల కామెంట్స్ వినిపించినా..మీరు ఇవేవి పట్టించుకోకండి..మనం పెద్ద హిట్ కొడుతున్నాము. కావాలంటే స్క్రిప్ట్ కోసం ఇంకాస్త సమయం తీసుకోండి..పక్కా ప్లాన్‌తో మొదలుపెడదాం.. అని కొరటాలకి తారక్ ధైర్యాన్నిచ్చారు. ఆ ధైర్యంతో తారక్ మీద ప్రేమ రెట్టింపు అయింది. భారీ హిట్ ఇవ్వాలనే కసి కూడా రెట్టింపయింది. ఖచ్చితంగా వీరు భారీ హిట్ కొట్టబోతున్నారు. ఇది రాసిపెట్టుకోండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news