Moviesపూర్ణ కాబోయే భర్తకు..కాజల్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

పూర్ణ కాబోయే భర్తకు..కాజల్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

నటి పూర్ణ..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో సినిమా అవకాశాల కోసం..ఫస్ట్ హిట్ కోసం చాలా కష్టపడినా..పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు అవును, అవును 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమె అనుకున్న స్ధాయిలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.కానీ ఢీ షో పుణ్యమా అంటూ జడ్జీగా చేస్తూనే సినిమాలో మంచి మంచి అవకాశాలు కొట్టేసి.. పలు ఈవెంట్స్ లోను హాట్ పర్ ఫామెన్స్లు ఇచ్చి..తన లోని నటనా టాలెంట్ ని అందరికి చూయించింది. ఇక అలా అమ్మడుకి ఢీ షో మరో లైఫ్ ఇచ్చింది. ఇటీవలే పూర్ణ తలైవి, అఖండ, దృశ్యం 2 వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి..మెప్పించింది.

కాగా, రీసెంట్ గా అమ్మడు పెళ్లి ఫిక్స్ అయ్యిందని తన కాబోయే భర్త ఫోటో పోస్ట్ చేస్తూ..అఫిషీయల్ మ్యారేజ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. దీంతో పూర్ణ పెళ్లి చేసుకోబోతున్న షానిద్ ఆసిఫ్ ఆలీ ఎవరని అంతా ఆరాతీస్తున్నారు. అతను ఓ బిజినెస్ మెన్ అని జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ ఫౌండర్ అండ్ సీఈఓ అని తను కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలిసింది. ఆసిఫ్ అలీ యూఏఈ బిజినెస్ మేన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలకు ఆయ‌న యూఏఈ వీసాలను అందిస్తుంటారు.

బడా హీరోయిన్స్ కాజల్‌, ప్రియమణి, ఆండ్రియా, లక్ష్మీ, విజయ్‌ సేతుపతి, స్వేతా మీనన్‌, నాజర్‌, అజారుద్దీన్‌ వంటి సెలబ్రిటీలకు ఈయన వీసాలు అందించారు. అప్పడు పెద్ద గా ఈయనని పట్టించుకోలేదు కానీ..ఇప్పుడు పూర్ణ పెళ్లాడబోతుంది ఈయననే అని తెలియడంతో..మన తెలుగు వాళ్ళు ఈయన గురించి ఎక్కువుగా సెర్చ్ చేస్తున్నారట . అలాగే కేరళా సీఎం నుండి ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా అవార్డును అందుకున్న షానిద్‌.. కూడా ఓ సెలబ్రెటీ లైఫ్ నే గడుపుతుంటారు. ముస్లీం మత పెద్దలతో కూడా ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.సోష‌ల్ మీడియాలోనూ ఆయ‌న‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్య‌క్తినే పూర్ణ పెళ్లాడ‌బోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news