Moviesబాలయ్యకి ఏం కావాలో ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు..డైరెక్టర్...

బాలయ్యకి ఏం కావాలో ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు..డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో మొదటి సినిమా చేసి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. పటాస్ సినిమా కమర్షియల్ హిట్ ఇవ్వడంతో నిర్మాతల, హీరోల దృష్ఠి అనిల్ రావిపూడి మీద పడింది. ఈ సినిమా తర్వాత సుప్రీమ్మ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలు చేసి భారీ హిట్స్ ఇచ్చాడు. ఒక్కో సినిమా బ్లాక్ బస్టర్ అవుతుండటంతో దర్శకుడిగా అనిల్ రావిపూడి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో నందమూరి నటసింహం బాలకృష్ణతో రామారావు అనే టైటిల్‌తో సినిమా చేస్తాడనే ప్రచారం గత ఏడాది నుంచి జరిగింది.

రామారావు టైటిల్ విషయంలో క్లారిటీ లేదు గానీ, అనిల్ రావిపూడు బాలయ్యతో సినిమా చేయడం మాత్రం కన్‌ఫర్మ్ అని స్వయంగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు పక్కా కమర్షియల్ అండ్ కామెడీ చిత్రాలుగా రూపొందాయి. మొదటిసినిమా ఓటాస్‌లో సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినా కూడా అందులో కామెడీ ట్రాక్‌కు ఎక్కువగా ప్రశంసలు దక్కాయి. దాంతో అనిల్ కూడా అప్పటి నుంచి తన సినిమాలలో ఎక్కువగా జంధ్యాల టైప్ కామెడీ ట్రాక్ ఉండేలా స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు.

అయితే బాలయ్యకి కావాల్సింది ఇలాంటి కామెడి స్క్రిప్ట్ కాదు. మీసం మెలేయాలి, తొడ చరచాలి..పవర్ ఫుల్ డైలాగులు చెప్పాలి. అప్పుడే బాలయ్య స్టామినాకు సరిపడా బాక్సాఫీస్ లెక్కలు నమోదవుతాయి. అభిమానులకు పండగ చేసుకున్నట్టుంది. అయితే, అనిల్ బాలయ్యతో సినిమా ఎంటే అందరిలో ఉన్న సందేహం ఉండేది. దీనికి తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. బాలయ్య స్టామినాకి తగ్గ పక్కా యాక్షన్ స్టోరీనే తీయబోతున్నారట. అంతేకాదు, బాలయ్య ఎలాంటి డైలాగులు చెప్ఫే డైలాగులకు థియేటర్స్ దద్దరిల్లిపోతాయని చెప్పుకొచ్చాడు.

ఇక ఇది పక్కా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. కాగా బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలయ్య ఓ సినిమాను చేయబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news