Moviesసినిమా ఫ్లాప్ అయితే చంకలు గుద్దుకోవడం ఏంటయ్యా బాబు..అలీ షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఫ్లాప్ అయితే చంకలు గుద్దుకోవడం ఏంటయ్యా బాబు..అలీ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి మల్టీ స్టారర్ గా నటించిన చిత్రం F3. ఈ సినిమా గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. మూడేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రీసెంట్ గా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అనిల్ అంటేనే కామెడీ..ధియేటర్ కి వచ్చిన జనాలని కడుపుబ్బ నవ్వించడానికే చూస్తారు.

అలా ఈ F3 సినిమాలో కూడా ఆయన కామెడీ మ్యాజిక్ మిక్స్ చేసి..F3 ఫన్ క్రియేట్ చేసి..ఎలాగోలా సక్సెస్ కొట్టారు. ఈ సంధర్భంగా ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకీ, వరుణ్. ప్రగతి. రాజేంద్ర ప్రసాద్, అలీ కూడా పాల్గోన్నారు. ఈ క్రమంలోనే అలీ స్టేజీ పై మాట్లాడుతూ ..F3 సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న వారి పై మండిపడ్డారు .

“అలా F3 సినిమా ప్లాప్ అని చెప్పితే మీకు ఏంటయ్యా లాభం. బాగున్న సినిమాని బాగోలేదు అనడం కరెక్ట్ కాదు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొందరు ప్రముఖులే..F3 సినిమా పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు. వాళ్లు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీరు ఉండేది ఈ ఇండస్ట్రీలోనే. అయినా, బాగున్న సినిమాని అందరు బాగుంది అంటుంటే..మీరు మాత్రమే ఫ్లాప్ ఫ్లాప్ అని చెప్పి చంకలు గుద్దుకోవడం ఏంటయ్యా..”అంటూ తన దైఅన స్టైల్ లో నవ్వుతూ మాట్లాడుతూనే రాడ్ దింపేశారు. దీంతో అలీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news