Moviesఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే...!

ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – అనుష్క కాంబినేషన్లో ఒక్క ఫుల్ లెన్త్ మూవీ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. కేవలం చింతకాయల రవి సినిమాలో మాత్రమే ఎన్టీఆర్… అనుష్క, వెంకటేష్ తో కలిసి ఒక పాటలో కనిపించారు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఓ సినిమా రావాల్సి ఉన్నా మిస్ అయ్యింది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం రుద్రమదేవి సినిమాలో మాత్రం ఎన్టీఆర్ హీరోగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది మిస్ అయ్యింది.

 

ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మొదట గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబును సంప్రదించిరు. ఇందులో పాత్ర నిడివి చాలా తక్కువ ఉండటంతో మహేష్ , తారక్ ఈ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదట‌. దీంతో డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్‌ని సంప్రదించగా ఆ పాత్రలో నటించడానికి ఓకే చెప్పారట. బ‌న్నీ బందిపోటు దొంగ గోన గ‌న్నారెడ్డిగా ఆ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.

వాస్త‌వానికి ఇదే పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించి ఉంటే మ‌రో లెవ‌ల్లోనే ఉండేద‌ని సినిమా స‌ర్కిల్స్‌లో అప్పుడు టాక్ వినిపించింది. డైరెక్టర్ గుణశేఖర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాల రామాయణం సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ చిన్న వ‌య‌స్సులోనే చేసిన న‌ట‌న అఖిలాంధ్ర ప్రేక్ష‌కుల‌ను ఊపేసింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ – గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్లో మ‌ళ్లీ సినిమా రాలేదు.

ఈ క్ర‌మంలోనే రుద్ర‌మ‌దేవి సినిమాలో గోన గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్‌ను న‌టింప జేసేందుకు గుణ‌శేఖ‌ర్ చాలా ప్ర‌య‌త్నించారు. అయితే ఎన్టీఆర్ గోన గ‌న్నారెడ్డి క్యారెక్ట‌ర్‌ను ఫుల్‌గా డ‌వ‌ల‌ప్ చేస్తే తాను హీరోగా చేస్తాన‌ని చెప్ప‌డంతో గుణ‌శేఖ‌ర్ చివ‌ర‌కు బ‌న్నీతో ఫిక్స్ య్యారు. అలా ఎన్టీఆర్ – అనుష్క కాంబినేష‌న్ మిస్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news