Moviesస్టార్ డైరెక్టర్ కి స్పెషల్ పార్టీ ఇచ్చిన తారక్...పిక్స్ వైరల్..!!

స్టార్ డైరెక్టర్ కి స్పెషల్ పార్టీ ఇచ్చిన తారక్…పిక్స్ వైరల్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రీసెంట్ గానే RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రజెంట్ కొరటాల శివతో సినిమా కి కమిట్ అయిన తారక్..జూన్ మొదతి వారంలో ఈ సినిమా ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి మంచి డిమాండ్ ఉంది. తారక్ సినిమా అనగానే చాలా మంది ఫాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక తారక్ కూడా తన దగ్గర నుండి వచ్చే సినిమాలు అలా నే ఉండాలి అని ట్రై చేస్తున్నారు.

సినిమాల పరంగా ఎంత బిజీ గా ఉన్నా..ఖచ్చితంగా ఫ్యామిలీకి టైం ఇస్తాడు తారక్. ఈ క్రమంలోనే తారక్ పెళ్ళి రోజున ఫుల్ టైం భార్య కి అంకితం చేశాడు. రోజు ఫోన్ కాల్స్..మీటింగ్స్..అంటూ పరుగులు తీసే తారక్.. నిన్న అనగ మే 5 న తన పెళ్లి రోజు సంధర్భంగా పూర్తి టైం భార్యతోనే గడిపారట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ..నందమూరి ఫాన్స్ కి గిఫ్ట్ గా ..పెళ్లి రోజున ఓ స్పెషల్ పిక్ ని పోస్ట్ చేశారు..అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఆ ఫోటోలో మరో స్టార్ జంట కూడా ఉండటం గమనార్హం. KGF 2 తో ఇండియన్ సినిమా చరితను తిరగరాసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన భార్యతో కలిసి తారక్-ప్రణతి లా పెళ్లి రోజు సంధర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ స్పెషల్ విషేస్ అందించారట. దీంతో వాళ్లకి గ్రాండ్ Welcome ఇస్తూ తారక్ స్పెషల్ పార్టీని కూడా ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఫుల్ సరదాగా గడిపిన తారక్-ప్రశాంత్.. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట పోస్ట్ చేయడంతో..ఆ పుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ పిక్స్ లో ముఖ్యంగా తారక్-ప్రణతి లు చాలా క్యూట్ గా ఉన్నారు. దీంతో అభిమానులు అన్న-వదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుతూ ..మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలంటూ కామెంత్స్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్-తారక్ సడేన్ స్పెషల్ పార్టీ పై ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కొరటాల సినిమా హోల్డ్ చేసి.. ఫస్ట్ వీళ్ళ సినిమా మొదలు పెట్టబోతున్నారా అంటూ డౌట్లు వస్తున్నాయి. మరి చూడాలి తారక్-ప్రశాంత్ ఏం చేయబోతున్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news