Moviesఅమెరికాలో "సర్కారు వారి పాట" సంచలన రికార్డ్.. ఏకైక హీరో మన...

అమెరికాలో “సర్కారు వారి పాట” సంచలన రికార్డ్.. ఏకైక హీరో మన మహేషే..!!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న రోజు మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా..మే12న గ్రాండ్ ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడేప్పుడో సరిలేరు నీకెవ్వరు అంటూ కనిపించిన మహేష్ ఆ తరువాతా చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 12న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.


రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు భారీగా పెంచేశారు డైరెక్టర్ పరశూరాం. సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించిన ట్రైల‌ర్‌గా ‘సర్కారు వారి పాట’ స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అంతే నా .. మహేష్ అంటే రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. సోష‌ల్ మీడియాలోనూ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.

అట్లుంటాది మహేష్ తో మువ్వీ అంటే. ఇక గీతాగోవిందం సినిమా లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందా అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ నెలకొంది. ప్రస్తుత అందుతున్న టాక్ ప్రకారం మహేష్ బాబు ఖాతలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా, ఇప్పటికే సర్కారు వారి పాట బోలెడు రికార్డులు కొల్లగొట్టి..సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే..మరో అరుదైన ఘనత సాధించాదు మహేష్. ఊర మాస్ ట్రైలర్ తో రికార్డులను కొల్లగొట్టిన ప్రిన్స్ .. సినిమా రిలీజ్ కాకముందే మరో మైండ్ బ్లాకింగ్ రికార్డ్ నెల్కోల్పాడు. . ఓవర్‌ సీస్‌ మార్కెట్ లో కీ రోల్‌ ప్లే చేసే ఊశాలో అత్యధికంగా 605 థియేటర్లలో రిలీజ్‌ కాబోతున్నాడు మన సూపర్ స్టార్.

అయితే, ఇప్పటి వరకు అమెరికాలో నాన్ పాన్ ఇండియా సినిమాల్లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వలేదు . నిజంగా ఇది ఓ రేర్ రికార్డే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అనడమే కాదు ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. సినిమా బొమ్మ పడక ముందే ఇలాంటి రికార్డులు సాధిస్తుంటే..సినిమా రిలీజ్ అయ్యక పరిస్ధితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news