Moviesఎన్టీఆర్‌తో సాయిప‌ల్ల‌వినా... ఆ కుర్ర బ్యూటీ కూడా...!

ఎన్టీఆర్‌తో సాయిప‌ల్ల‌వినా… ఆ కుర్ర బ్యూటీ కూడా…!

ఇది నిజంగానే ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌.. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – సాయిపల్ల‌వి కాంబినేష‌న్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎన్టీఆర్ న‌ట‌న అనే ప‌దానికే పెద్ద డిక్ష‌న‌రి. అందులోనూ గ‌త కొంత కాలంగా బాగా ప‌రిణితి చెందిన న‌ట‌న‌తో రాటుదేలిపోయి ఉన్నాడు. టెంప‌ర్‌లో నెగిటివ్ క్యారెక్ట‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో క్లాస్ క్యారెక్ట‌ర్‌… జ‌న‌తా గ్యారేజ్‌లో ఎమోష‌న్‌, జై ల‌వ‌కుశ‌లో మూడు దేనిక‌వే డిఫ‌రెంట్ రోల్స్‌, ఇక అర‌వింద స‌మేత మ‌రో టైప్ రోల్‌.. తాజాగా త్రిబుల్ ఆర్‌లో కొమ‌రం భీంగా న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న‌ట్టుగా చేసి ప‌డేశాడు.

ఇక తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ఇటీవ‌ల కాలంలో ఏ హీరోకు లేన‌ట్టుగా ఏకంగా డ‌బుల్ హ్యాట్రిక్ హిట్టు కొట్టాడు ఎన్టీఆర్. అస‌లు ఇలాంటి రికార్డు ఏ హీరో నుంచి కూడా ఊహించుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమాను కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయ‌నున్నారు.

కొర‌టాల తాజాగా తీసిన ఆచార్య ప్లాప్ అవ్వ‌డంతో ఎన్టీఆర్‌తో సినిమాను మ‌రింత క‌సితో తెర‌కెక్కించాల‌ని చూస్తున్నాడు. క‌థ‌, క‌థ‌నంతో పాటు కాస్టింగ్ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డేందుకు కొర‌టాల సిద్ధంగా లేడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఏ హీరోయిన్ న‌టిస్తుంద‌న్న దానిపై ర‌క‌ర‌కాల పేర్లు కొద్ది నెల‌లుగా వినిపిస్తూ ఉన్నాయి. ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభ‌ట్‌ను తీసుకున్నారు.

ఇటీవ‌లే ఆమెకు పెళ్ల‌వ్వడంతో ఆమే స్వ‌యంగా త‌ప్పుకుంది. త‌ర్వాత జాన్వీక‌పూర్ పేరు వినిపించింది. త‌ర్వాత మ‌రో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీని కూడా అనుకున్నారు. వీళ్లెవ్వ‌రు ఫైన‌లైజ్ కాలేదు. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి పేరు వినిపిస్తోంది. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌లో ఎంత పెద్ద హీరోతో అయినా పోటీ ప‌డుతుంది. అటు స్క్రీన్ మీద సాయి ప‌ల్ల‌వి.. ఎన్టీఆర్ క‌లిస్తే షేక్ అవ్వాల్సిందే.

సాయి ప‌ల్ల‌వి శ్యామ్‌సింగ‌రాయ్ సినిమా త‌ర్వాత ఎలాంటి సినిమాకు క‌మిట్ అవ్వ‌లేదు. ఇప్పుడు కొర‌టాల ఆమెకు త్వ‌ర‌లోనే క‌థ చెప్ప‌బోతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ సినిమా అంటే ఆమె ఖ‌చ్చితంగా ఓకే చెప్పేస్తోంది. ఇక ఇదే సినిమాలో శ్రీ లీల‌ను రెండో హీరోయిన్‌గా తీసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మొత్తానికి ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో ఎన్టీఆర్ తొలాసారిగా రొమాన్స్ చేయ‌బోతున్నాడు. సినిమాకు కూడా ఫ్రెష్ ఫీల్ రావ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news