Moviesవాళ్లు పుట్టింది మనుషులకేనా..రష్మి ని ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు..!!

వాళ్లు పుట్టింది మనుషులకేనా..రష్మి ని ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు..!!

రష్మి..ఓ అందాల యాంకర్. చిట్టి పొట్టి డ్రెస్లు వేసి..అందరిని అలరిస్తుంది..అంటూ అంతా అనుకుంటుంటారు. అంతకముందు చిన్న సినిమాల్లో మెరిసినా..రష్మికి లైఫ్ ఇచ్చింది మాత్రం..జబర్ధస్త్ షో అనే చెప్పాలి. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ..అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ మధ్య కొన్ని సినిమాల్లో నటించినా..కానీ అవి ఏవి సక్సెస్ కాలేదు. బోల్డ్ రోల్స్ లో నటించినా కానీ, ఆమెకు ఎందుకో సరైన ఆఫర్లు రాలేదు. ఇక యాంకరింగ్ చేసుకుంటూనే ఉండిపోయింది రష్మి.

రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. తన లేటేస్ట్ ఫోటో షూట్ తో పాటి..సమాజంలో జరిగే అన్యాయాల పై ఘాటుగానే స్పందిస్తుంది. మరి ముఖ్యంగా మూగ జీవాలపై..ఎవ్వరైన దాడి చేస్తే ..రష్మి సహించదు. తనదైన స్టైల్ లో సోషల్ మీడియా లోనే చీవాట్లు పెడుతుంది. రఫాడిస్తుంది. అంత ఇష్టం రష్మికి మూగ జీవాలు అంటే. ఓసారి జబర్ధస్త్ స్టేజీ పైనే..”మనుషులను నమ్మకూడదు ఎందుకంటె..వాళ్లు చెప్పేది ఒకటి..చేసేది మరోకటి..మనపై మూగ జీవాలు చూపించే ప్రేమ ఎంతో స్వఛమైనది” అంటూ ఎమోషనల్ అయ్యింది.

అంతేకాదు, మూగ జీవాలను ఎవ్వరైన హింసించిన్నట్లు తెలిసినా ఆమె ఊరుకోదు. రీసెంట్ గా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ కుక్కను దారుణంగా కొట్టి చంపిన ఘటన మనం చూశాం . దీని పై రష్మి స్పందిస్తూ..వాళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. “అస్సలు వాళ్లు మనుషులకే పుట్టారా..? ఇలా ఓ మూగ జీవిని ఎలా చంపగలరు. బుద్ధి ఉందా వాళ్లకి..? వాళ్ల పై గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అస్సలు వాళ్లని కాదు వాళ్లని పెంచిన పేరంట్స్ ది తప్పు”..అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. దీంతో రష్మి ఫ్యాన్స్ కూడా ఆమె సపోర్ట్ చేస్తూ,..ఆ మృగాల పై కఠిన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్లని పోలీసులు అరెస్ట్ చేసారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news