Moviesకీర్తి కూడా అలాంటిదేనా..అభిమానులకు బిగ్ షాక్..?

కీర్తి కూడా అలాంటిదేనా..అభిమానులకు బిగ్ షాక్..?

కీర్తి సురేష్..ఈ జనరేషన్ మహానటి. చుడటానికి చక్కటి రూపం తో అందరిని ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ. అందంలోనే కాదు..నటనలోను కీర్తికి అభిమానుల దగ్గర మంచి మార్కులే వేయించుకుంది. కీర్తి సురేష్ ఎన్ని సినిమాలు చేసినా..ఆమె కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఏదైన ఉంది అంటే అది మహానటి సినిమా నే అని చెప్పాలి . అచ్చం సావిత్రి గారిలా కనిపించి, నటించి, మెప్పించింది.

ఈ సినిమా తరువాత ఆమె బోలెడు సినిమాలు చేసిన ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వాలేదు సరికదా..పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకోలేదు. కానీ, అమ్మడి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గలేదు. ఇక ఫైనల్ గా ఎట్టకేలకు సర్కారు వారి పాట సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా అమ్మడు మహేశ్ పక్కన నటించిన తీరు..ఆ కమెడి లెవల్, మ మ మహేశ డ్యాన్స్ స్టెప్పులు ఆమె ఖాతాలో మరో హిట్ పడేలా చేసాయి.

ఇక ఎవ్వరైన హీరోయిన్ స్టార్ హీరో సినిమాతో హిట్ కొడితే..ఖచ్చితంగా, పక్క సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తుంది. ఇప్పటి వరకు అలాంటి హీరోయిన్లని చాలా మంది చూశాం. కానీ, వాళ్లందరిలోకి కీర్తి రూటే సపరేటు అని అంతా అనుకున్నారు. అయితే ఆ హీరోయిన్లకు నేను ఏమాత్రం తీసిపోను అంటూ కీర్తి కూడా రెమ్యూనరేషన్ ని పెంచేసింది. నిన్న మొన్నటి వరకు 2 కోట్లు పారితోషకంగా తీసుకునే కీర్తి..సర్కారు వారి పాట సినిమాతో ఏకంగా..3 కోట్లు చేసేసింది. ప్రస్తుతం ఆమెకి ఉన్న క్రేజ్ బట్టి..నిర్మాతలు కూడా అమ్మడు అడిగినంత ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news