Moviesఅందరిముందే లైవ్‌లో..స్టేజీ పైనే లిప్ లాక్..పాయ‌ల్ పాప తెగించేసిందిగా..!!

అందరిముందే లైవ్‌లో..స్టేజీ పైనే లిప్ లాక్..పాయ‌ల్ పాప తెగించేసిందిగా..!!

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ హాట్ ఐటెం బాంబ్. 2017లో చన్నా మేరేయా అనే పంజాబీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన పాయ‌ల్‌.. ఆ తరువాత దర్శకుడు అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమా తోనే హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది బోజ్ పూరి హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్. బోల్డ్ కంటెంట్ తో ఉన్న ఈ మూవీలో హాట్ హాట్ గా నటించి సంచనలం సృష్టించింది.


ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్క‌సారిగా కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టేసింది హాటీ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ప‌లు సినిమాలు చేసినా.. చివ‌ర‌కు విక్ట‌రీ వెంక‌టేష్ ప‌క్క‌న వెంకీ మామ సినిమా చేసినా ఆమెకు అనుకున్న గుర్తింపు రావ‌డం లేదు. దీంతో ప్లాన్ బీ స్టార్ట్ చేసి.. అందాలు ఆర‌బోసినా, బోల్డ్ క్యారెక్ట‌ర్లు చేసినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోల‌తో ఫ్యాన్స్‌కు వీనుల విందు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సినిమా అవకాశాలు నిల్ అయిన పాయల్ యమ హాట్ గా బాయ్ ఫ్రెండ్ సౌర‌భ్ దింగ్రాతో రెచ్చిపోయి మరీ స్టిల్స్ ఇస్తుంటుంది.

ఇక రీసెంట్ గా ఓ ప్రముఖ చానెల్ ప్రోగ్రామ్ లో పాలొగొన్న ఈమె ..తన బాయ్ ఫ్రెండ్ సౌర‌భ్ దింగ్రాతో కలిసి..డ్యాన్స్ చేసింది. అంతేనా..లైవ్ లోనే అంతమంది జనాలు చూస్తుండగనే టక్కున సౌర‌భ్ దింగ్రాతో లుప్ లాస్ చేసింది. ఈ ఊహించని పరిణామంతో సౌర‌భ్ దింగ్రా కూడా షాక్ అయ్యాడు. ఇక అక్కడ ఉన్న సెలబ్స్ నోట మాట రాలేదు. అంత హాట్ గా లిప్ లాక్ చేసిన అమ్మడు గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

సౌర‌భ్ దింగ్రాతో ఈ ముద్దుగ‌మ్మ‌పీక‌ల లోతు ప్రేమ‌లో ఉంది. ఈ విష‌యాన్ని వారు ప‌లు సంద‌ర్భాల్లో ఫొటోలు, వీడియోల ద్వారా త‌మ రిలేష‌న్‌ను తెలియ‌జేస్తూనే వ‌చ్చారు. కానీ, ఇలా లైవ్ లో ముద్దులు పెట్టడం ఏంటి మరి విడ్డూరం కాకపోతే..ఇలా బరితెగించేసింది పాయల్ అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news