Movies' స‌ర్కారు వారి పాట ' తాళాల క‌థ ఇదేనా... !

‘ స‌ర్కారు వారి పాట ‘ తాళాల క‌థ ఇదేనా… !

మ‌హేష్‌బాబు తాజా సినిమా స‌ర్కారు వారి పాట మ‌రో ప‌ది రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి హిట్ సినిమా త‌ర్వాత మ‌హేష్ రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాలో న‌టించారు. గీత‌గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప‌ర‌శురాం డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవ‌ల రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో పాటు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

త్వ‌ర‌లో రిలీజ్ అయ్యే మూడో పాట కూడా సినిమాను సూప‌ర్ హిట్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇక ఎప్పుడూ ఏ సినిమా గురించి రిలీజ్‌కుముందు.. ఆ త‌ర్వాత పెద్ద‌గా మాట్లాడ‌ని సీనియ‌ర్ ఎడిట‌ర్ మార్తాండ్ కె. వెంక‌టేష్ సైతం స‌ర్కారు వారి పాట సినిమాను బాగా ఎంజాయ్ చేస్తార‌ని చెప్ప‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే స‌ర్కార్‌వారి పాట పోస్ట‌ర్‌లో మ‌హేశ్‌బాబు చేతిలోని పెద్ద తాళాల గుత్తి ఏంట‌న్న‌దే ఇప్పుడు అంద‌రికి భారీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ తాళాల గుత్తి చూస్తుంటే చాలా పాత‌కాళం నాటివిలా ఉన్నాయి. మ‌రి ఈ తాళాల‌కు, హీరోకు సంబంధం ఏంట‌న్న‌దానిపై ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతోంది. హీరో విదేశాల్లో ఉంటాడ‌ట‌. హీరో తండ్రికి హైద‌రాబాద్‌లో ఓ ఇళ్లు ఉంటుంది.

విల‌న్ హీరో తండ్రిని బ్యాంక్ అప్పుల్లో ఇరికించేసి గ‌వ‌ర్న‌మెంట్‌తో ఆ ఇంటిని వేలం వేయించేస్తాడు. తండ్రి ఇబ్బందుల్లో ప‌డ‌తాడు.. అవ‌మానంతో కుంగిపోతాడు. ఈ విష‌యం తెలుసుకున్న హీరో ఇండియా వ‌స్తాడు. ఇక్క‌డ హీరోయిన్‌తో ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారుతోంది. ఇంత‌కు హీరోయిన్ ఎవ‌రో కాదు… విల‌న్ కూతురు అని తెలుస్తుంది.

ఆ విల‌న్ ఒక్క హీరో ఫ్యామిలీనే కాదు… చాలా మందిని మోసం చేసి వారి ఇళ్లు కూడా వేలం వేసేందుకు కార‌ణం అవుతాడ‌ని తెలుస్తుంది. అలా హీరో రిక‌వ‌రీ చేసే ఇళ్ల తాళాల గుత్తు అది అట‌. అలా ఒక్కో ఇంటిని రిక‌వ‌రీ చేస్తూ ఆ తాళం వాళ్ల‌కు ఇస్తూ ఉంటాడ‌ట‌. ఇక హీరో ఎక్కడో విదేశాల్లో ఉండ‌డం.. ఇండియాకు వ‌చ్చి వాళ్ల ఫ్యామిలీ లేదా గ్రామం ఇబ్బందుల్లో ఉంటే అక్క‌డకు వెళ్లి వాటిని ప‌రిష్క‌రించ‌డం చూస్తూనే ఉన్నాం. మ‌రి ఈ సినిమాను ప‌ర‌శురాం – మ‌హేష్ ఎంత‌లా మ్యాజిక్ చేస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news