Moviesఅబ్బబ్బా..మహేశ్ నోట ఊర మాస్ డైలాగ్స్..‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్..(వీడియో)..!!

అబ్బబ్బా..మహేశ్ నోట ఊర మాస్ డైలాగ్స్..‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్..(వీడియో)..!!

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన టైం వచ్చేసింది. మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యుండాలి.. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఇంత లేట్ అయ్యింది. అయినా కానీ.. అభిమానులను ఎంటర్ టైన్ చేయాడాని డబుల్ జోష్ నింపుకుని ధియేటర్ లో సందడి చేయడానికి వచ్చేస్తున్నాదు మహేష్ బాబు.

ఈ నెల 12న సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్పటికే మేక‌ర్స్ భారీ ఎత్తున ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, పాటలు ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కళావతి అనే సాంగ్‌‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. కాగా సినిమా రిలిజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా టీం ట్రైలర్ ని రిలీజ్ చేసింది. కొద్ది నిమిషాల ముందే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అభిమానులకు తెగ నచ్చేసింది.

సినిమా ట్రైలర్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయ్యేలా పరశురాం జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ నోట ఊర మాస్ డైలాగ్స్ అభిమానులను పిచ్చెక్కిస్తుంది. యు కెన్‌ స్టీల్‌ మై లవ్‌(నా ప్రేమ దొంగలించగలవు), యు కెన్‌ స్టీల్‌ మై ఫ్రెండ్‌షిప్‌(నా స్నేహాన్నీ.. దొంగలించగలవు’.. బట్‌ యు కాంట్‌ స్టీల్‌ మై మనీ’ అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే మ‌హేష్ ఫ్యాన్స్‌, సినీ ఆడియెన్స్‌, ట్రేడ్ వ‌ర్గాలు సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. బ్యాంకులు.. ఆర్థిక నేరాలు అనే ప్రధానమైన పాయింట్ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ అభిమానులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది అని అర్ధమైపోతుంది. మరి ఎందుకు ఆలస్యం ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ పై మీరు ఓ లుక్కెయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news