Moviesచిరంజీవి డెడికేషన్‌కు జోహార్లు... ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏం కావాలి...!

చిరంజీవి డెడికేషన్‌కు జోహార్లు… ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏం కావాలి…!

మెగాస్టార్లు ఎవరూ ఊరకే అయిపోరు. దాని వెనక వారి సాధన కఠోర పరిశ్రమ చాలా ఉంటుంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే కాలేజీ డేస్ నుంచే నటుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. టాలీవుడ్ లో అప్పటికే టాప్ ఫోర్ గా ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు వంటి హేమాహేమీలు ఉన్నా కూడా తనకూ ఒక ప్లేస్ చూసుకోవాలనుకున్నారు.

అలా సినీ రంగానికి ఒంటరిగా వచ్చారు చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఆయనకు లేదు. పూణెలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆయన నటన విషయంలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక శిక్షణలో ఉంటూండగానే చిరంజీవికి పునాది రాళ్ళులో ఫస్ట్ చాన్స్ వచ్చింది. ఆ మూవీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ లేట్ అయింది. ఈ లోగా ప్రఖ్యాత నిర్మాత కమ్ దర్శకుడు క్రాంతి కుమార్ తీసిన ప్రాణం ఖరీదులో మంచి పాత్రతో చిరంజీవి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ విధంగా చూస్తే ఫస్ట్ మూవీ ఇదే అనుకోవాలి.

కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి ఎక్కువగా విలన్ పాత్రలు వేసేవారు. అలా ప్రసిద్ధ దర్శకుడు కె బాలచందర్ తీసిన ఇది కధ కాదు మూవీలో చిరంజీవి నటించారు. ఈ మూవీలో ఆయన జయసుధ భర్తగా ఒక శాడిస్ట్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకు ఒక విధంగా ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు అనే చెప్పాలి. ఈ క్యారక్టర్ ని పోషించడం చాలా కష్టం. ఎందుచేతనంటే పైకి నవ్వుతూ డీసెంట్ గా కనిపించాలి. విలనీ అంతా మాటల్లో, చేతల్లోనే ఎగ్జిబిట్ కావాలి.

దాని కోసం బాగా సాధన చేసి చిరంజీవి పాత్రను పండించారు. ఆ సినిమాలో కమల్ హాసన్, శరత్ బాబు కూడా ఉన్నారు. వారు అప్పటికే సీనియర్లు. ఇక జయసుధ గురించి చెప్పాల్సింది లేదు. సహజ నటి. ఆమెతో కలసి నటించడం ఒక ఎత్తు అనుకుంటే తనకు ఇచ్చిన పాత్రకు నూరు పాళ్ళు న్యాయం చేశారు.
ఇక ఈ మూవీ షూటింగులో చిత్రం ఒకటి జరిగింది. మద్రాస్ లోని ఒక స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించి జయసుధ చిరంజీవిల మధ్య షాట్స్ కొన్ని తీస్తున్నారు.

ఒక షాట్ అయితే ఎప్పటికీ ఓకే కాలేదుట. ఉదయం నుంచి రాత్రి వరకూ అలా టేకుల మీద టేకులు తింటూ చిరంజీవి మొత్తానికి డైరెక్టర్ కె బాలచందర్ అనుకున్నట్లుగా వచ్చేలా చిరంజీవి చేసిన తీరుకు మొత్తం యూనిట్ హాట్సాఫ్ అనేసిందిట. ఇక బాలచందర్ అయితే చిరంజీవి అంకితభావాన్ని మెచ్చుకుని గొప్ప నటుడు అవుతావు అని నాడే దీవించారుట. అది జరిగిన తరువాత కె బాలచందర్ తీసిన మరో సినిమా 47 రోజులు మూవీలో చిరంజీవి పాలిష్డ్ విలన్ కమ్ హీరో గా నటించి మెప్పు పొందారు.

ఆ తరువాత ఆయన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి రుద్ర వీణ మూవీని బాలచందర్ డైరెక్షన్ లో తీశారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొత్తానికి నాడే దిగ్దర్శకులు బాపు, బాలచందర్, విశ్వనాధ్ వంటి ప్రముఖ్యుల మన్ననలు అందుకోవడం వల్లనే నేటికీ ఆయన మెగాస్టార్ గా నిలిచి గెలిచాడు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news