Moviesబాల‌య్య సినిమా రిలీజ్ అంటే ఈ సెంట‌ర్ల‌లో బొమ్మ 100 ప‌డాల్సిందే..!

బాల‌య్య సినిమా రిలీజ్ అంటే ఈ సెంట‌ర్ల‌లో బొమ్మ 100 ప‌డాల్సిందే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఇప్పుడు కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. గ‌తేడాది చివ‌ర్లో క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అఖండ ఎంత సూప‌ర్ హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడున్న రోజుల్లో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా థియేట‌ర్ల‌లో రెండో వారం ఉండ‌డ‌మే గ‌గ‌నం అవుతోంది. అలాంటిది అఖండ ఏకంగా 50 రోజులు దాటేసి.. 20 కేంద్రాల‌కు పైగా శ‌త‌దినోత్స‌వం ( 4 డైరెక్ట్ కేంద్రాలు) జ‌రుపుకుని.. ఇప్పుడు 150 క్రాస్ చేసి చిల‌క‌లూరిపేట‌లో 175 రోజుల దిశగా ప‌రుగులు పెడుతోంది.

బాల‌య్య సినిమా వ‌చ్చిందంటే చాలు కొన్ని కేంద్రాలు ఆయ‌న సినిమాల‌కు అడ్డాగా మారిపోతాయి. సినిమా ఎలా ఉన్నా అక్క‌డ 100 రోజులు – 150 – 200 రోజులు ప‌డిపోవాల్సిందే. అలాంటి కేంద్రాలు ఎక్కువుగా సీడెడ్‌లో ఉన్నాయి. రాయ‌ల‌సీమ అంటేనే నంద‌మూరి, బాల‌య్య ఫ్యాన్స్ కంచుకోట‌. లెజెండ్ సినిమా ప్రొద్దుటూరులో షిఫ్టింగ్‌ల‌తో క‌లుపుకుని 1000 కు పైగా రోజులు ఆడింది. ఎమ్మిగ‌నూరులో కూడా 400 రోజుల‌కు పైగా ఆడింది.

 

సీడెడ్‌లో ఎమ్మిగ‌నూరు – ఆదోని – ప్రొద్దుటూరు – కోయిల‌కుంట్ల – క‌ర్నూలు – నంద్యాల లాంటి సెంట‌ర్ల‌లో బాల‌య్య హిట్ సినిమాలు మాత్ర‌మే కాదు.. యావ‌రేజ్‌, ప్లాప్ సినిమాలు సైతం 100 రోజులు ఆడేశాయి. సింహా సినిమా విశాఖ‌ప‌ట్నంలోని గోపాల‌ప‌ట్నం మౌర్యం డీల‌క్స్‌లో 200 రోజులు ఆడితే సీడెడ్‌లో ఆదోని – ప్ర‌భాక‌ర్, జ‌మ్మ‌ల‌మ‌డుగు అలంకార్‌లో 175 రోజులు ఆడింది. బాల‌య్య యావ‌రేజ్ సినిమా డిక్టేట‌ర్ కూడా ఇక్క‌డ 100 రోజులు ఆడింది.

 

అలాగే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సీడెడ్‌లో 100 రోజులు ఆడింది. పైన చెప్పుకున్న సెంట‌ర్లు అంటే బాల‌య్య సినిమాల‌కు కంచుకోట‌లు.. ఇవి నంద‌మూరి న‌ట‌సింహం అడ్డాలు. అలాగే కోస్తాలో కూడా బాల‌య్య‌కు అడ్డా అయిన సెంట‌ర్ ఒక‌టి ఉంది. అదే గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌. ఈ కేంద్రంలో కూడా నంద‌మూరి ఫ్యామిలీ సినిమాలు సెంచ‌రీల మీద సెంచ‌రీలు కొట్టేస్తూ ఉంటాయి.

చిల‌క‌లూరిపేట రామ‌కృష్ణ థియేట‌ర్లో బాల‌య్య ప్లాప్ సినిమా ల‌య‌న్ కూడా 100 రోజులు ఆడింది. ఇక అఖండ సినిమా తాజాగా 150 రోజులు క్రాస్ అయ్యి.. ఇప్పుడు 175 రోజుల‌కు ప‌రుగులు పెడుతోంది. ఇదే థియేట‌ర్లో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ కూడా 100 కొట్టేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news