Moviesబాల‌య్య - అనిల్ రావిపూడి సినిమాపై 3 క్రేజీ అప్‌డేట్స్‌... హీరోయిన్...

బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాపై 3 క్రేజీ అప్‌డేట్స్‌… హీరోయిన్ కూడా ఫిక్స్‌…!

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ – వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం బాల‌య్య.. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే సెప్టెంబ‌ర్ నుంచి అనిల్ – బాల‌య్య సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ఈ సినిమా గురించి ఎఫ్ 3 ప్ర‌మోషన్ల‌లో అనిల్ రావిపూడి ప‌లు విష‌యాలు చెప్పేస్తున్నారు.

ఈ సినిమాలో బాల‌య్య‌ది 50 ఏళ్ల వ‌య‌స్సు మ‌ళ్లిన తండ్రి పాత్ర అని.. వ‌య‌స్సు మ‌ళ్లిన తండ్రికి.. కుమార్తెతో ఎలాంటి అనుబంధం ఉంటుందో ఈ సినిమాలో చూపించ‌బోతున్నా అని.. కుమార్తె పాత్ర‌లో యంగ్ హీరోయిన్ శ్రీలీల న‌టించ‌బోతోంద‌ని అనిల్ ఇప్ప‌టికే ఫుల్ ఓపెన్ అయిపోయాడు. అనిల్ చెప్పిన ఈ మాట‌ల‌తో బాల‌య్య ఫ్యాన్స్ కూడా సినిమాపై మ‌రింత అంచ‌నాల‌తో ఉన్నారు.

సినిమా రిలీజ్ అయ్యాక బాల‌య్య‌ను ఇలా కూడా చూడొచ్చా ? అని ప్ర‌తి ఒక్కరు ఆశ్చ‌ర్య‌పోయేలా ఆయ‌న క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అనిల్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి 50 ఏళ్ల వ‌య‌స్సులో బాల‌య్య పాత్ర ఉంటుంద‌ని.. శ్రీలీల బాల‌య్య‌కు కూతురు పాత్ర‌లో న‌టిస్తుంద‌ని.. ఈ సినిమా క‌థ అంతా తండ్రి, కూతురు మ‌ధ్యే అల్లుకుని ఉంటుంద‌ని చెప్పాడు. ఇలా మూడు మేజ‌ర్ అప్‌డేట్స్ ఇచ్చిన అనిల్ సినిమాలో కామెడీ, యాక్ష‌న్ సీక్వెన్స్ పుష్క‌లంగా ఉన్నాయ‌ని చెప్పాడు.

 

ఇక ఈ సినిమాలో న‌టించే హీరోయిన్ గురించి కూడా ఓ అదిరిపోయే న్యూస్ వ‌చ్చేసింది. బాల‌య్య‌కు జోడీగా న‌య‌న‌తార న‌టించ‌బోతోంద‌ట‌. గతంలో బాల‌య్య – న‌య‌న కాంబోలో సింహా, శ్రీరామ‌రాజ్యం, జై సింహా లాంటి హిట్ సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు సీనియ‌ర్ హీరోల‌లో న‌య‌న‌తార బాల‌య్య‌తో త‌ప్ప ఎవ్వ‌రితోనూ న‌టించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ర‌న్న టాక్ కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె బాల‌య్య సినిమా అన‌గానే.. అటు క‌థానాయిక పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంద‌ని చెప్పిన వెంట‌నే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింద‌ట‌.

ఏదేమైనా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచ‌నాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. మొత్తానికి బాల‌య్య యాక్ష‌న్‌, అనిల్ కామెడీ డోస్‌తో ఈ సినిమాను స‌రికొత్త‌గా చూడ‌బోతున్నాం అన్న ఫీలింగ్ అయితే వ‌చ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news