Moviesసౌందర్య చనిపోవడం ఆ హీరోయిన్ కు ప్లస్ అయ్యిందా..?

సౌందర్య చనిపోవడం ఆ హీరోయిన్ కు ప్లస్ అయ్యిందా..?

సౌంద‌ర్య..ఈ పేరు చెప్పితే టక్కున మనకు గుర్తు వచ్చేది ఆమె చక్కటి అందం..ఆ తరువాత గుర్తు వచ్చేది ఆమె మంచి మనసు. సౌందర్య .. పేరుకు కన్నడ నటి అయినా..తెలుగులో ఎక్కువ సినిమాలు చేసి..తన అందంతో నటనతో..మంచి మంచి సినిమాలు చేసి..కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. చలన చిత్ర పరిశ్రమలో ఆమె కంటూ ఓ ప్రత్యేక స్ధానాని ఏర్పర్చుకుంది.

దేవుడు మంచి వాళ్లనే త్వరగా తీసుకెళ్ళిపోతారు అంటారు. బహుశ సౌందర్య విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఊహించని విమాన ప్రమాదంలో ఆమె మరణించారు . సౌంద‌ర్య ద‌క్షిణ భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో త‌న సినిమాల‌తో కని విని ఎరుగని చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. ఆమె కెరీర్ లో ఎంద‌రో టాప్ హీరోల‌తో హ్యాట్రిక్ సినిమాలో నటించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. సౌంద‌ర్య ద‌క్షిణాదిలో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో క‌లిపి మొత్తం 12 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో న‌టించి అరుదైన రికార్డ్ సృష్టించింది.

అయితే, ఈమె చనిపోయిన తరువాత ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. సౌందర్య చనిపోవడం అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన స్నేహ కు మంచి గా ప్లస్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. స్నేహ కూడా సౌందర్య లాగే ఫ్యామిలీ హీరోయిన్ అంటూ ఓ ముద్ర వేయించుకుంది. పద్ధతిగా చీర కట్టుకుని..సాంప్రధాయబద్ధకంగా ఉండే రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వచ్చింది. దీంతో ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్య అంటూ టాక్ వినిపించింది. ఇదే విషయం పై స్నేహ తన రీసెంట్ ఇంటర్వ్యుల్లో ప్రశ్నలు ఎదురవ్వగా..ఆమె సమాధానమిస్తూ..’అలాంటిది ఏం లేదు. నేను ఆమెకు బిగ్ ఫ్యాన్ ని. ఆమె చిన్న వయసులోనే చనిపోవడం బాధకరం..నేను సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె మరణ వార్త విని..చాలా బాధపడ్డాను”అంటూ చెప్పుకొచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news