Moviesఅన‌సూయ మైకంలో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ... ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్...

అన‌సూయ మైకంలో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ … ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్ ఇదే..!

క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర‌నే కాదు.. అటు వెండితెర‌ను కూడా ఏలేస్తోంది. ఇటు యాడ్స్‌లోనూ కుమ్మి ప‌డేస్తోంది. బుల్లితెర‌కు హాట్ యాంక‌ర్ ఇమేజ్ రావ‌డంలో తెలుగు వ‌ర‌కు అన‌సూయ‌దే కీల‌క రోల్‌. అన‌సూయ ఏ షో చేసినా ఆమె అందం.. హాట్‌నెస్ అంటేనే బుల్లితెర కుర్ర‌కారు ప‌డిచ‌చ్చేవాళ్లు. అలాంటిది వెండితెర మీద‌కు ఎంట్రీ ఇచ్చిన అన‌సూయ అక్క‌డ కూడా ముందు హాట్ రోల్స్‌తో ఆక‌ట్టుకోవాల‌ని అనుకుంది.

అయితే ఆమెకు ఇక్క‌డ బ‌ల‌మైన పాత్ర‌లు రావ‌డం.. మంచి న‌టిగా త‌న‌ను తాను ఫ్రూవ్ చేసుకోవడంతో వెండితెర‌పైనా ఇప్పుడు అన‌సూయ‌కు తిరుగేలేదు. సుకుమార్ ఎప్పుడు అయితే రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర ఇచ్చాడో కాని.. ఆ పాత్ర‌తో ఆమెకు వెండితెర మీద కూడా తిరుగులేకుండా పోయింది. అంత‌కుముందే విన్న‌ర్ లాంటి సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసి ర‌చ్చ చేసింది.

ఇక పుష్ప సినిమాలో త‌న‌లోని నెగిటివ్ యాంగిల్ ఏంటో కూడా చూపించింది. పుష్ప 2 సినిమాలో లేడీ విల‌న్‌గా ఆమె పాత్ర అదిరిపోతుంద‌ని కూడా అంటున్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న ఆమె శుభ‌గృహ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ కోసం యాడ్‌లో న‌టించింది. చిరు ప‌క్క‌న ఆమె అలా క్యూట్‌గా ఒదిగిపోయి ఉంది. దీంతో పాటు త్వ‌ర‌లోనే రాబోతోన్న మెగాస్టార్ ఆచార్య సినిమాలోనూ ఆమె కీల‌క‌పాత్ర‌లో కనిపించ‌బోతోంది. ఈ పాత్ర సినిమాను ట‌ర్న్ చేసే పాత్ర అని అంటున్నారు.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ అన‌సూయ‌పై చాలా స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ చూపిస్తుండ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుక్కు అంటేనే అన‌సూయ మైకంలో మునిగి తేలిపోతున్నాడు. రంగ‌స్థ‌లం సినిమాలో అన‌సూయ‌కు ఛాన్స్ ఇవ్వ‌డం ఒక ఎత్తు అయితే.. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లోనూ ఆమెలోని మ‌రో యాంగిల్‌ను ప్ర‌జెంట్ చేస్తున్నాడు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరుతో చేసిన రియ‌ల్ ఎస్టేట్ యాడ్‌లోనూ ఏకంగా చిరు ప‌క్క‌నే ఛాన్స్ ఇచ్చేశాడు. దీంతో పాటు మ‌రో ఒక‌టి రెండు చిన్న సినిమాల్లోనూ సుక్కునూ స్వ‌యంగా అన‌సూయ‌ను రిక‌మెండ్ చేసి మ‌రీ ఛాన్సులు ఇప్పించాడ‌ట‌. ఈ తంతు అంతా గ‌మ‌నిస్తోన్న వారు సుక్కు – అన‌సూయ గురించే హాట్ టాపిక్‌గా చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news