Moviesఆ హీరోయిన్‌ను రిక‌మెండ్ చేస్తోన్న ప్ర‌భాస్‌... ఈ ముదురు బ్యాచిల‌ర్‌కు అంత...

ఆ హీరోయిన్‌ను రిక‌మెండ్ చేస్తోన్న ప్ర‌భాస్‌… ఈ ముదురు బ్యాచిల‌ర్‌కు అంత మోజు ఏంట‌బ్బా ?

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ఓ పాన్ ఇండియా స్టార్‌. బాహుబ‌లి సీరిస్ సినిమాల‌కు ప్ర‌భాస్‌కు నేష‌న‌ల్ వైడ్‌గా మామూలు క్రేజ్ రాలేదు. ఆ త‌ర్వాత సాహో, ఇటీవ‌ల వ‌చ్చిన రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్క‌డంతో ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఆ రేంజ్‌లోనే కాస్టింగ్‌తో పాటు బ‌డ్జెట్ కూడా ఉండాలి. ఇప్పుడు ప్ర‌భాస్ లైన‌ప్‌లో ఉన్న ప్రాజెక్ట్ కేతో పాటు ఆదిపురుష్‌, స్పిరిట్‌, స‌లార్ 1,2 అన్ని ఇలా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులే ఉన్నాయి.

ఇంత క్రేజ్ ఉన్న ప్ర‌భాస్ అనూహ్యంగా యంగ్ డైరెక్ట‌ర్ మారుతితో సినిమాకు ఓకే చెప్ప‌డం ఎవ్వ‌రికి అర్థం కాలేదు. 60 రోజుల కాల్షీట్లు మాత్ర‌మే ప్ర‌భాస్ ఈ సినిమాకు ఇచ్చాడ‌ట‌. దీని వెనక ఓ స్టోరీ ఉంద‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది. రాధేశ్యామ్ సినిమా రిలీజ్ టైంలో మేక‌ర్స్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వేళ ప్ర‌భాస్ డీవీవీ దాన‌య్య‌ను హెల్ఫ్ అడిగార‌ట‌. దాన‌య్య ప్ర‌భాస్‌కు రు. 75 కోట్లు సింగిల్ ఫేమెంట్ చేయ‌డంతో ఆయ‌న‌కు ఓ సినిమా చేసి పెడ‌తాన‌ని చెప్ప‌డంతో పాటు 60 రోజుల కాల్షీట్లు ఇచ్చేశాడు.

అదే ఇప్పుడు ప్ర‌భాస్ – మారుతి సినిమాగా వ‌స్తోంది. ఇక ఈ నెల 10న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంటోంది. అయితే సెట్స్ మీద‌కు వెళ్లేందుకు కాస్త టైం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే ప్రాజెక్టుల్లో బిజీ ఉన్నాడు. ఇవి పూర్త‌వుతోన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. హ‌ర్ర‌ర్ కామెడీ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని .. మారుతి క‌థ‌కు తుది మెరుగులు దిద్దే ప‌నిలో ఉన్నాడ‌ని అంటున్నారు.

బొమ‌న్ ఇరానీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. హైద‌రాబాద్‌లో స్పెష‌ల్ సెట్లు కూడా భారీ ఎత్తున వేస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్ల‌కు స్కోప్ ఉంది. వాళ్ల పేర్లు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ప్ర‌ముఖంగా శ్ర‌ద్ధా క‌పూర్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమెను ప్ర‌భాసే స్వ‌యంగా రిక‌మెండ్ చేశాడ‌ని అంటున్నారు. ఆమె సాహో సినిమాలో ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించింది.

ఆ సినిమా టైం నుంచి వీరి మ‌ధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. అందుకే ప్ర‌భాస్ ఆమెను స్వ‌యంగా రిక‌మెండ్ చేశాడ‌ని అంటున్నారు. చాలా త‌క్కువ కాల్షీట్లే ప్ర‌భాస్ ఇవ్వ‌డంతో స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసి ఈ యేడాది దీనిని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ మ‌ధ్య‌లో ప్ర‌భాస్ మారుతికి ఎప్పుడు డేట్లు ఇస్తాడో ? మారుతి ఎంత స్పీడ్‌గా పూర్తి చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news